సిర్పూర్ నుండి ఎన్నికల యుద్దానికి సై ప్రవీణ్ కుమార్
ఓటమి పాలైతే రాజకీయసన్యాసం తీసుకుంటా

కుమ్రంబీమ్ జిల్లా
సిర్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.బిఎస్ పి తెలంగాణ రాష్ట్ర బిఎస్పీ అధ్యక్షుడు అర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇక్కడి నుండి పొటీ చేసి ఎమ్మెల్యేగా విజయంసాదిస్తానన్నారు..ఒకవేళ. సిర్పూర్ నియోజకవర్గంలో విజయం సాదించకపోతే రాజకీయాల నుండి తప్పుకోని సన్యాసం స్వీకరిస్తానన్నారు .. కుమ్రంబీమ్ జిల్లా కాగజ్ నగర్ లో నిర్వహించిన. సభలో ఆయన మాట్లాడారు సిర్పూర్ నియోజక వర్గం లో బిఎస్పీ పార్టీ తరపున నీలి కండువావేసుకొని అసెంబ్లీకి పోకపోతే అంబేత్కర్ సాక్షిగా నేను రాజకీయలనుండి వైదొలుగుతానన్నారు. సిర్పూర్ ప్రాంతానికి ఇంకా తెలంగాణ రాలేదు ఆంద్రపాలనలోనే నడుస్తుందన్నారు…
తుమ్మడిహెట్టి ప్రాజెక్టు ఇక్కడినుండి తరలించి కాళేశ్వరానికి తరలించి వేల కోట్లు దోపిడి చేశారని ఆరోపించారు. సీఎం
కేసీఆర్ నూతనంగా నియమించిన చీప్ సెక్రటరీ శాంత కుమారి కి అర్హతలు లేవన్నారు.. అన్ని అర్హతలున్న ఒక దళితమహిళ రాణి కుముదినికి సీఎం కేసీఆర్ అన్యాయం చేశాడని అర్ ఎస్పీమండిపడ్డారు.. ఎమ్మెల్యే కోనప్ప. బారీగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు