సత్తుపల్లిలో గాలివాన బీభత్సం
తీవ్రంగా నష్టపోయిన కూరగాయల, మిర్చి రైతులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో గాలివాన బీభత్సం సృష్టించింది.ఒకసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది.ఇటీవల కురిసిన వర్షాలకు అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు.మరోసారి ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో మామిడి,మొక్కజొన్న,మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి పెనుబల్లి మండల పరిధిలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.కొత్త కారాయిగూడెం,అడవి మల్లెల గ్రామంలో గాలి దుమారానికి విద్యుత్ స్తంభాలు,చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మరోవైపు కల్లూరు మండలంలోని పలు గ్రామాలలో కళ్ళల్లో ఆరబోసి ఉంచిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.