ప్రీతి పై ర్యాగింగ్ జరిగింది
సైప్ ర్యాగింగ్ చేశారని నిర్థారించిన కమీటీ

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని ప్రీతి ర్యాగింగ్ కు గురైందని నిర్ధారించింది . ర్యాగింగ్ కమిటీ. భౌతికంగా కాకుండా మెంటల్ గా సీనియర్ పిజీ వైద్య విద్యార్థి సైఫ్ వేధించాడని కమిటీ విచారణలో తేలింది. ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం కేఎంసీలో ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. ఆర్డీఓ, ఏసిపి ఇద్దరు యూజీ వైద్య విద్యార్థులు, మరో ఇద్దరు పిజీ వైద్య విద్యార్థులు, పేరెంట్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ,జర్నలిస్ట్ మొత్తం 14 మందితో కూడిన కమిటీ సమావేశమై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది.
సమావేశానికి అనస్థీషియా విభాగం డాక్టర్ నాగార్జున రెడ్డిని పిలిచి ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. ప్రీతి ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా హెరాస్మెంట్ గురైనట్లు కమిటీ నిర్థారించిందని కేఎంసి ప్రిన్సిపల్ మోహన్ దాస్ స్పష్టం చేశారు. కమిటీ నివేదికను బహిర్గతపర్చలేమని డిల్లీ యూజీసీకి
పంపిస్తామని తెలిపారు కేఎంసి ప్రిన్సిపల్ మోహన్ దాస్.