ప్రీతిది లవ్ జీహది కేసే బండి సంజయ్

కేసును నీరుగార్చే కుట్ర జరుగుతుందని ఆరోపణ

కరీంనగర్

వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతిది ముమ్మాటికీ ‘లవ్ జిహాదీ కేసేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో వ్యాఖ్యానించారు. తక్షణమే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.. విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారరని అన్నారు. చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని ఇతర దేశాల నుండి డబ్బులొస్తున్నాయనీ ఆరోపించారు.. ఈ కేసును నిర్వీర్యం చేయడానికి తూతూ మంత్రంగా కేసులు పెట్టి నిందితుడిని రక్షించే యత్నం చేస్తున్నారనీ విమర్శించారు. హైదరాబాద్ లో కుక్కల దాడిలో చిన్న పిల్లాడు చినిపోతే కుక్కలకు మటన్ దొరకకపోవడంవల్లే అలా చేశాయని తేలికగా చెప్పడం సిగ్గు చేటు అని విమర్శించారు ఈ రెండు విషయాల్లో ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించకపోవడం దారుణం అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కు మంత్రి ktr లకు దమ్ముంటే తెలంగాణలో జరిగిన అభివ్రుద్ధి, ఇచ్చిన హామీలతోపాటు కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలనీ సవాల్ చేశారు..‍

Leave A Reply

Your email address will not be published.