ఆర్థరాత్రి అడవిలో ప్రసవించిన అదివాసీ తల్లి
పురుడు కోసం ఎండ్ల బండి పై వెళ్లిన. గిరిజన మహిళ

- ఆ. తల్లి పురిటి నోప్పులతో తల్లడిల్లింది…ఆసుపత్రికి వెళ్లుదామంటే దారిలేదు.. అంబులెన్స్ రాదు.. పురుడు కోసంఎండ్ల బండిలో నిర్మల్ జిల్లా వసుదాపూర్ నుండి సరిత. పురుడు కోసం అసుపత్రికి అర్థరాత్రి పూట కారుడవలొ బయలుదేరింది… మార్గమద్యలో ఎంగ్లాపూర్ కారడవిలో పురిటి నోప్పులు అదికమ్యాయి… అక్కడే అడవి సరిత ప్రసవించింది… ప్రసవించిన తర్వాత. అతికష్టం మీద. దోంతివాగు దాటించారు.. ఆ తర్వాత. మండలకేంద్రానికి మహిళను తరలించారు…అక్కడి నుండి అంబులెన్స్ లో నిర్మల్ అసుపత్రికి తరలించారు… తల్లి పిల్లలు కోలుకుంటున్నారు.. అయితే దోంతి వాగు బ్రిడ్జీ, వసుదపూర్ కు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అదివాసీలు ఉద్యమిస్తున్నారు…అయినప్పటికీ అదికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు అందోళన వ్యక్తం చేస్తున్నారు… ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని అదివాసీలు సర్కార్ ను కోరుతున్నారు