రేవంత్ పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు
వివాదస్పద వ్యాఖ్యలపై పోలీసులకు పిర్యాదు చేసిన బిఅర్ ఎస్ నాయకులు

ములుగు జిల్లా
హాథ్ సే హాథ్ యాత్రలో భాగంగా ములుగులో రాత్రి జరిగిన సభలో టీపీసీసీ
చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం కేసిఆర్ ఉండే ప్రగతిభవన్ ను పేల్చివేయాలని, నక్సలైట్లు పేల్చివేసినా నష్టమే ఉండదని వ్యాఖ్యానించడం పట్ల బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కెసిఆర్ కు ప్రాణానికి హాని చేసే మాట్లాడిన రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ములుగు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పోరిక విజయ్ రామ్ నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. నక్సలైట్లతో జరిగిన లోపాయికారి కుట్రలో బాగంగానే అలా మాట్లాడి ఉంటాడనే అనుమానం ఉందని ఫిర్యాదు లో పెర్కొన్నారు. మాజీ నక్సలైట్ అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఇట్టి వ్యవహారంలో మధ్యవర్తిత్వాన్ని నెరపినట్లుగా తాము భావిస్తున్నామని తెలిపారు. అనుశ్చిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, ఆయనకు సహకరిస్తున్న ఎమ్మెల్యే సీతక్కపై కుట్ర కేసు నమోదుచేసి విచారణ జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.