ప్రీతిది అత్మహత్యే ..సీపీ రంగనాథ్
అత్మహత్యకు సైప్ కారణమని తెలింది. సీపీ

వరంగల్ ఎంజీఎం లో మెడికో ప్రీతి మృతిపై మిస్టరీ వీడింది. ప్రీతి ది ఆత్మహత్యేనని తేలింది. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని వరంగల్ సిపి ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. అతని వేదింపుల వల్లే మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో ఆత్మహత్య కు పాల్పడినట్లు తేలిందన్నారు. సైఫ్ పై 306 సెక్షన్ క్రింద చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సిపి రంగనాథ్ తెలిపారు.