విషవాయువులు పీల్చిన 12 మందికిఅస్వస్థత
అసుపత్రిలో చేరిన పన్నేండు మఙది

జనగామ లో విషవాయువు లీకైంది. క్లోరిన్ గ్యాస్ లీకైl పలువురు అస్వస్థతకు గురయ్యారు. దగ్గు శ్వాస ఆడని పరిస్థితిలో 12 మంది ఆసుపత్రిలో చేరారు. మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ వద్ద నీటిలో కలిపే క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో విషవాయువులు వెదజల్లుతాయి. వెంటనే అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు సిబ్బంది లీకైన క్లోరిన్ గ్యాస్ మొద్దును నీళ్లలో వేశారు. గ్యాస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించారు. అప్పటికే ఆ ప్రాంతంలో వాయువులు పీల్చిన వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్ళినవారు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. క్లోరిన్ గ్యాస్ లీక్ తో అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించి అందరు ఊపిరి పీల్చుకున్నారు.
……