చెడ్డీ గ్యాంగ్ దోంగల ముఠాకోసం ప్రజల వేట

గ్రామాల్లో దోంగలు రాకుండా రాత్రి పహరా కాస్తున్నా యువకులు

చెడ్డీ గ్యాంగ్ దోంగల ముఠా దండయాత్ర….‌‌ తలుపులు బద్దలు చేస్తోంది… తాళాలు ద్వంసం చేస్తోంది… డ్రిల్స్ గోడలకు రంద్రాలకు చేస్తోంది‌.‌ఇండ్లలో బంగారాన్ని, వెండి నగలను లూటీ చేస్తోంది.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా. చేస్తోంది.. కంటికి చిక్కకుండా పోలీసులకు దోరకకుండా చుక్కలు చూపిస్తున్నా చెడ్డీ గ్యాంగ్ ముఠా .. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు దడపుట్టిస్తున్నా చెడ్డీ గ్యాంగ్ పై ప్రత్యేక కథనం

ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దందా సాగిస్తోంది‌… రాత్రి పగలు తేడా లేకుండా లూటీలు చెస్తోంది.. మొన్న జైనథ్ మండలం దీపాయిగూడలో దోంగల మఠా ఓ ఇంట్లో చోరబడింది…బారీగా బంగారాన్ని చోరికి పాల్పపడింది.. ఎకంగా కీటీకీలను ద్వంసం చేసి లూటీ చేసింది ముఠా… ఆ తర్వాత. నిన్న బోథ్ మండలం పోచ్చేరలో అడుగుపెట్టింది…నలుగురు సభ్యులు గల ముఠా ఊరంతా తిరిగింది.. దోంగతనం ప్రయత్నాలు చేసింది…చోరికి యత్నించిన. విజువల్‌ కెమెరాలలో కూడ రికార్డయ్యాయి… చోరి చేయడానికి అనువైన వాతావరణం ‌కనిపించలేదు.‌కాని గ్రామంలో ఒక బైక్ ను ఎత్తుకవేళ్లింది ముఠా.. ఆ తర్వాత నిన్న మద్యహన్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూహౌజింగ్ బోర్డులోని ఓ ఉపాద్యాయుని పట్టపగలే ఇంట్లో చోరికి పాల్పపడింది‌… ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయంలో మద్యహన్నం రెండున్నరనుండి మూడున్నర గంటల సమయంలో చోరికి పాల్పపడ్డారు… ఇంటిముందున్నా గెట్ తాళం ద్వంసం వేశారు… అ తర్వాత ఇల్లు మేయిన్ గేట్ తాళంను బద్దలు చేసి ఇంట్లోకి చోరబడ్డారు…పందోమ్మిది తులాల బంగారాన్ని ఎత్తుకవెళ్లారు దోంగలు.. మద్యహన్నం తరువాత ఇంటికి వచ్చిన. కుటుంబ సభ్యులు చోరిజరగడం చూసి నివ్వెర పోయారు, పట్టపగలే పంథోమ్మిది తులాల బంగారం ,వెండిని ఎత్తుకవెళ్లారని బాదితులు పోలీసులకు పిర్యాదు చేశారు.

నిన్నటి పట్టపగలు చోరి సంఘటన మరువకముందే…ఈ రోజు ఇచ్చోడలో ఈ తెల్లవారుజామున ఇదే దోంగల ముఠా రెండు ఇండ్లలోకి చోరికి ప్రయత్నించింది… ఎకంగా తలుపులకు డ్రిల్ చేసి చోరికి ప్రయత్నించింది…‌ఈ సందర్భంగా తలుపులకు దోంగలు ముఠా డ్రిల్ తో రంద్రాలు చేసింది… ఆ డ్రిల్ శబ్దాలు ఇంటి కుటుంబ సభ్యులకు మెలుకువచ్చింది‌ …‌ దాంతో అప్రమత్తమై అరుపులు , కేకలు వేయడం‌తో దోంగలు పారిపోయారు

..‌పారిపోయిన. దోంగల కోసం పోలీసులు అన్వేషణ కోనసాగిస్తున్నారు… సీసీ కెమెరాలలో దోంగలు విజువల్స్ అదారంగా పోలీసులు విచారణ కోనసాగిస్తున్నారు‌.‌దోంగలను పట్టుకోవడానికి అన్ని పోలీస్ స్టేషన్ లను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అప్రమత్తం చేశారు… అదేవిధంగా జిల్లాలో సంచరిస్తున్నా దోంగలు ‌మహరాష్ట్రకు చెందిన. దోంగలుగా బావిస్తున్నామని ఆయన అంటున్నారు…‌ అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేయడమే కాకుండా ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రజలను కోరుతున్నారు..
.

అయితే దోంగల భయంతో గ్రామాలు వణుకుతున్నాయి… దోంగలు లూటీ చేయకుండా చర్యలు చేపడుతున్నారు.. అందులో బాగంగా యువకులంతా రాత్రిపూట గస్తీకాస్తు‌‌న్నారు‌.‌‌ ఈ.  సందర్బంగావ అనుమానం ఉన్నా ప్రతి ఒక్కరి వివరాలను గస్తీ కాస్తున్నా యువకులు సేకరిస్తున్నారు…‌ ఒకవేళ అనుమానం ఉన్నా వారిపై సమాచారం పోలీసులకు ఇస్తున్నారు యువకులు.. ఈవిదంగా గ్రామంలో ప్రజలందరిని‌ అప్రమత్తం  చేస్తున్నారు‌ ‌‌..  దోంగల భయం దూరం చేయడానికి ప్రజలకు కాపాలాకాస్తు యువకులు బరోసానిస్తున్నారు

 

Leave A Reply

Your email address will not be published.