కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ పై ప్రజల సంబరాలు

ఐటిడిఎ పీఓ . వరుణ్ రెడ్డి మాకే కావలంటున్నా అదివాసీలు

.. ఆ  జిల్లాలో  ‌ఆ  కలెక్టర్  బదిలీతో  పీడన  పోయిందని సంబరాలు    చేసుకున్నారు…  టపాసులుపెల్చారు…స్వీట్లు పంపిణీ చేశారు… మరో జిల్లాలో  అదివాసీ అత్మబందువు   ఐటిడిఏ  పీఓ  వరుణ్  రెడ్డి బదిలీ  ‌పై   అదివాసీలు తిరుగబడుతున్నారు‌‌… మా అదికారి   మాకే కావలంటూ     గిరిజన బిడ్డలు పోరాటానికి  సిద్దమంటున్నారు..   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  అగ్గిరాజేస్తున్నా కలెక్టర్ల. బదిలీల పై  ప్రత్యేక కథనం

. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ల.  బదిలీ  వివాదస్పంగా మారింది.. మంచిర్యాల జిల్లా కలెక్టర్ బారతి హోలికేరి,  నిర్మల్  కలెక్టర్   ముష్రాప్  అలీ,  ఆదిలాబాద్   జిల్లా  కలెక్టర్ సిక్తాపట్నాయక్,    కుమ్రంబీమ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఉట్నూర్  ఐటిడిఎ. పీఓ వరుణ్    రెడ్డి     అధికారులను సర్కార్    బదిలీ చేసింది..

..‌కుమ్రంబీమ్ జిల్లా కలెక్టర్  రాహుల్  రాజ్  ను ఆదిలాబాద్  జిల్లా  కలెక్టర్  గా నియమించింది ప్రభుత్వం .. ఆయితే రాహుల్  రాజ్ ‌ను అవినీతి  అరోపణల పై బదిలీ చేయాలని     కుమ్రంబీమ్  జిల్లాలో    ఆ ప్రాంతంలో  గత కోన్ని రోజులుగా   ప్రజలు  ఉద్యమిస్తున్నారు.. దర్నాలు  చేస్తున్నారు…అయితే ఎట్టేకేలకు      కలెక్టర్ ‌ రాహుల్ రాజ్   ను   బదిలీ   చేయడంతో    ప్రజలు, యువజన సంఘాలు ఆనందానికి  అవదులు లేకుండా పోయింది…  రాహుల్  రాజ్   బదిలీ    జిల్లా కు ‌పీడపోయిందని   ప్రజలు     యువజన సంఘాల అధ్వర్యంలో    సంబరాలు జరుపుకున్నారు..అందులో బాగంగా  జిల్లా కేంద్రం లో    టపాసులు పెల్చారు…స్వీట్లు పంచుకున్నారు‌అక్కడి  యువజన  సంఘాలు… రాహుల్ రాజ్  పాలన. వైపల్యంతో   జిల్లా  అబివ్రుద్ది పూర్తి గా వెనుకబడిందని అందోళనవ్యక్తం  చేశారు‌‌ .‌కాని  రాహుల్  రాజ్  స్థానంలో   షేక్  యాస్మిన్ బాషాను కలెక్టర్ గా నియమించారు‌‌..‌‌ ఆతర్వాత కలెక్టర్   షేక్  యాస్మిన్ బాషాను  మార్చింది సర్కారు…‌ ప్రస్తుతం మంచి కలెక్టర్ కు అదనపు బాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు  జారీ చేసింది.  ఇప్పటికైనా సర్కారు స్పందించి జిల్లా కు ‌మంచి   కలెక్టర్ ను నియమించాలని ప్రజలు  సర్కార్ ను కోరుతున్నారు

. మరోవైపు   ఉట్నూరు‌ఐటిడిఎ.  పీఓ. గా విదులు నిర్వహిస్తున్నా  వరుణ్  రెడ్డి ని  నిర్మల్ కలెక్టర్   గా నియమించారు.‌. ఐటిడిఎ. అదికారిగా ఉన్నా    పీఓను బదిలీ  చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు అదివాసీలు  …  తక్కువకాలంలో  మంచిపేరు  తెచ్చుకున్నారు‌‌‌..గిరిజనుల అభివృద్ధి కోసం   పాటుపడుతున్నారు  .. కేవలం ఎనిమిది  నెలల కాలంలో బాద్యతలు స్వీకరించిన అదికారిని     అప్పుడే బదిలీ చేయడం పై  గిరిజనులు సర్కారు తీరు పై‌మండిపడుతున్నారు…అదివాసీల అభివృద్ధిని   పరుగులు పెట్టిస్తున్నా  పీఓను  బదిలీ చేయడమంటే…. గిరిజనుల అభివృద్ధి   కుంటుపర్చడమంటున్నారు‌..వెంటనే   ఈ బదిలీని రద్దు చేయాలని  అదివాసీలు  డిమాండ్  చేస్తున్నారు.. ‌లేదంటే   బదిలీ అపాలని పోరాటం చేస్తామని సర్కార్ కు హెచ్చరికలు  జారీ చేశారు….

.అదివాసీలు  పీఓ. వరుణ్  రెడ్డి కోసం పట్టుబడుతున్నారు..‌  ఇప్పటికే  వరుణ్ రెడ్డి  నిర్మల్  కలెక్టర్ గా బాద్యతలు స్వీకరించారు.‌‌‌.. మరి అదివాసీలను సర్కారు  సంత్రుప్తి పరుస్తుందనేది    అసక్తి రేపుతోంది…మరి సర్కార్ అదివాసీలను   ఏలా అసంత్రుప్తి పరుస్తుందో చూడాలి

Leave A Reply

Your email address will not be published.