పాప పాలకోసం పదికిలోమీటర్ల ప్రయాణం
ఆవునిచ్చి పాప పాలకోరతను తీర్చిన ఆరోగ్య మంత్రి హరీష్

పసి పాప పాల కోసం.. పదికిలో మీటర్ల. ప్రయాణం.. ఆకలి తీర్చడానికి అవును ఇవ్వాలని ఐటిడిఎ అదికారులకు దరఖాస్తు చెసిన కుటుంబ సభ్యులు…కనికరించని అదికారులు…కాని ఆకలితో అలమటిస్తున్నా పసిపాప పాల కష్టాలు తీర్చడానికి ఆరోగ్యమంత్రి స్పందించారు… పాల కోసం ఆవు అందించారు..ఆకలిని తీర్చారు… పాప పాల కోసం పదికిలో మీటర్లనడకపై ప్రత్యేక కథనం
. ఆదిలాబాద్ జిల్లా రాజుగూడ. మారుమూల ప్రాంతం…ఈ గూడేంలో ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి.. గూడేనికి చెందిన కోడప. పారుబాయి గర్బీణీ ఇంద్రవేళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రసవించింది.. జనవరి పది తారీఖున. పండంటి పాపకు జన్మనిచ్చింది…ఆ తర్వాత మరుసటి రోజు అసుపత్రి డిచార్జయ్యారు.. తల్లి, బిడ్డ. ఇంటికి చేరుకున్నారు.. కాని ఇంటికి చేరుకున్నా తర్వాత రోజు తల్లి ప్రాణాలుకోల్పోయింది..
.. తల్లి ప్రాణాలు కోల్పోవడంతో పాపకు పాలు కరువయ్యాయి…పోని ఆ ప్రాంతంలో పాలు కోనుగోలు చెద్దామంటే పాలు దోరకవు…. పాప పాల కోసం ఇంద్రవెల్లి వెళ్లాలి… ఇంద్రవెల్లి వెళ్లాలంటే రాజుల గూడ నుండి మూడు కిలోమీటర్ల దూరం చిట్టిదర్ ఖానాపూర్ నడవాలి.. మళ్లీ చిట్టిదర్ ఖానాపూర్ నుండి ఇంద్రవెల్లి మరోక ఏడు కిలో మీటర్ల ప్రయాణం సాగించాలి..
.. ఈవిదంగా ప్రతినిత్యం తండ్రి జంగుబాబు, తాత బాబు రావు పాప పాలకోసం పది కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగిస్తున్నారు.. ఇంద్రవేళ్లి నుండి పాలను తేస్తున్నారు.. పాప ఆకలిని తీర్చుతున్నారు.. అయితే ప్రతినిత్యం పాలకోసం ఇంద్రవెల్లి వెళ్లడం ఇబ్బంది గా మారింది… ఆ ఇబ్బంది తోలగించడానికి పాల కోసం అవును ఇవ్వాలని ఐటిడిఎ అదికారులకు దరఖాస్తు చేసుకున్నారు..కాని ఐటిడిఎ అదికారులు స్పందించలేదు.. ఆవును ఇవ్వలేదు.
.. అయితే పాప పాల కోసం కుటుంబ సభ్యులు పడుతున్నా కష్టాల పై ఆరోగ్య మంత్రి హరీష్ రావు స్పందించారు.. పాప ఆరోగ్యం తెలుసుకోవడానికి వైద్య బ్రుందాన్ని పంపారు… అదేవిధంగా పాప పాల కోసం పశు సంవర్థక శాఖ. నుండి ఒక ఆవును పసిపాప కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ ఇప్పించారు. పాల ఆకలిని తీర్చడానికి ఆవును ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు… పాపం కోసం స్పందించిన మంత్రికి క్రుతజ్నతలు తెలిపారు కుటుంబానికి సభ్యులు