కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు లేవు

పాలేరు టిక్కేట్ బిఅర్ ఎస్, సీపీఎం మద్య ముదిరిన పంచాయితీ

ఖమ్మం జిల్లా బిఅర్  ఎస్ , సీపీఎం మధ్య పాలేరు టిక్కెట్ పై పంచాయతీ ముదురుతోంది. రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. పొత్తులో భాగంగా పాలేరు టిక్కెట్  సీపీఎం ఆశిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. పాలేరు స్తానం తమకు కీలకమని స్వయంగా తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.మరోవైపు కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయనిసంచలన కామెంట్స్ చేశారు పాలేరు ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి.ఖమ్మం జిల్లా కూసుమంచి లో జరిగిన పాస్టర్ల సమ్మేళనం లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ప్రకటించారు ఉపేందర్ రెడ్డి.గెలుపు కూడా తనదేనని కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జనచైతన్య యాత్రలో సీపీఎం నాయకులు పాలేరు టికెట్‌ అడుగుతున్నాం అని చెప్పారనికానీ మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలంటూకమ్యూనిస్టులకు ఓట్లువేసే రోజులు పోయాయి. ఇది నిజమేనా, కాదా అంటూ సభలోనే ఎమ్మె ల్యే ప్రశ్నించారు.‘ప్రజల కు మేలు చేస్తున్నాననుకుంటే నన్ను గెలిపించాలి, ఇంకా ఎవరైనా మేలు చేస్తారనుకుంటే వారినే గెలిపించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు కందాళ.మరోవైపు కందాల ఉపేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిపిఐ, సిపిఎం పార్టీలు మండిపడుతున్నాయి.కమ్యూనిస్టు పార్టీ ఓట్లతో ఎన్నికై ఇప్పుడు ఆ సందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు బిజెపికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కలిసి చేస్తున్న పోరాటానికి ఆటంకంగా మారుతాయని వామపక్ష పార్టీల నాయకులు చెపుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.