పాలేరు సీటు మాదే తమ్మినేని వీరభద్రం

సీట్ల గురించి వివాదాలు ముందే చెప్పితే గోడవలు వస్తాయి

ఖమ్మం జిల్లా

నేలకొండపల్లి మండలం కొరట్ల గూడెం లో తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు .బిఅర్ ఎస్,సీపీఎం,సీపీఐ పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు.సీపీఎం, సీపీఐ కి కొన్ని సీట్లు కేటాయిస్తారు…సీట్ల గురించి ఇప్పుడే చెపితే చిక్కులు వస్తాయన్నారు.సీట్ల కేటాయింపు లో పాలేరు నెంబర్ వన్ లో ఉందన్నారు..మంచిని కోరే ప్రతి ఒక్కరి ఓటు మాకు పడాలన్నారుకాబట్టి సీపీఎం పార్టీకి పాలేరు లో సీటు ఖాయం గా కేటాయిస్తారని భావిస్తున్నాము..రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డు పడుతుందని..రాష్ట్రానికి ఏ అధికారం లేదని ప్రతి మోటార్ కి మీటర్ పెట్టి ఫీజ్ వసూలు చేయాలని కేంద్రం చూస్తుంది.
రాష్ట్రం విద్యుత్ ఫ్రీగా ఇచ్చిన కేంద్రం అడ్డం పడుతుంది, ఇలాంటి దుష్ట బీజేపీ అధికారంలో ఉంటే దేశానికి ప్రమాదమన్నారు.బీజేపీ అధికారంలో ఉంటే బ్రిటిష్ వారు రాక ముందు రాజ్యాలు గా ఎలా కొట్టుకున్నామో అట్లాంటి పాత రోజులకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.అందుకే వామపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నయని అన్నారు

Leave A Reply

Your email address will not be published.