బిఅర్ ఎస్ ,సీపీఎం మద్య పాలేరు టిక్కేట్ పంచాయితీ
తమకే టిక్కేట్ దక్కుతుందంటున్నా రెండు పార్టీలు

ఖమ్మం
బిఅర్ ఎస్, సీపీఎం ల మధ్య పాలేరు టిక్కెట్ పంచాయతీ ముదురుతోంది..రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ స్థానికంగా శరవేగంగా మారుతున్నాయి.పొత్తులో భాగంగా పాలేరు టిక్కెట్ సీపీఎంపార్టీ ఆశిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం..పాలేరు స్థానం తమకు కీలకమని స్వయంగా తమ్మినేని వీరభద్రం ప్రకటించారు..మరోవైపుకమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని సంచలన కామెంట్స్ చేశారు పాలేరు ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి..రసవత్తరంగా మారుతున్న పాలేరు బీఆర్ఎస్,సీపీఏం మధ్య టికెట్ యుద్ధం పై ప్రత్యేక కథనం
.ఖమ్మం జిల్లా పాలేరు పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి..కాంగ్రెస్,బీజేపీ పార్టీల హడావుడి స్థానికంగా అంతగా లేకపోయిన బీఆర్ఎస్,సీపీఏం పార్టీల పొత్తుల హడావుడి రోజుకో మలుపు తిరుగుతుంది..వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటి చేయాలని డిసైడ్ అయ్యారు ఏమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి..దినిలో బాగంగానే కూసుమంచి లో జరిగిన పాస్టర్ల సమ్మేళనం లో కీలక వ్యాఖ్యలు చేశారు..రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని క్లారిటీ గా ప్రకటించారు..గెలుపు కూడా తనదేనన్నారు…ఇటీవలే జనచైతన్య యాత్రలో సీపీఎం నాయకులు పాలేరు టికెట్ అడుగుతున్నాం అని చెప్పారని కానీ మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలంటూ కమ్యూనిస్టులకు ఓట్లువేసే రోజులు పోయాయని చెబుతు..నిజమేనా, కాదా అంటూ సభలోనే ఎమ్మె ల్యే ప్రశ్నించారు.దిన్ని బట్టి చూస్తే పొత్తు లో బాగంగా టికెట్ ఆశిస్తున్న సీపీఏం కు ఇండైరెక్ట్ గా ఏమ్మేల్యే కందాల సెటైర్ ఇచ్చారన్న ప్రచారం లోకల్ గా నడుస్తుంది.అంతేకాదుప్రజల కు మేలు చేస్తున్నాననుకుంటే నన్ను గెలిపించాలి, ఇంకా ఎవరైనా మేలు చేస్తారనుకుంటే వారినే గెలిపించండి’ అంటూ హట్ కామెంట్స్ చేశారు కందాల…
మరోవైపు కందాల ఉపేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిపిఐ,సిపిఎంపార్టీలుమండిపడుతున్నాయి..కమ్యూనిస్టు పార్టీ ఓట్లతో ఎన్నికై ఇప్పుడు ఆ సందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు బిజెపికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కలిసి చేస్తున్న పోరాటానికి ఆటంకంగా మారుతాయని వామపక్ష పార్టీల నాయకులు చెపుతున్నారు…ఇప్పటికే సీపీఏం పార్టీ చెపడుతున్న జన చైతన్య యాత్ర కు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు సంబంధించిన ఏమ్మేల్యేలు సంఘీభావం పలుకుతున్నారు.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తులు ఉంటాయని తమ్మినేని పదే పదే క్లారిటీ ఇస్తున్న విషయం తెలిసిందే…
.వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటి చేయాలని తమ్మినేని వీరభద్రం ఆలోచిస్తున్నారు..దీనిలో బాగంగానే గ్రౌండ్ వర్క్ సైతం ప్రిపేర్ చేసుకుంటున్నారు..పాలేరు లో సీపీఏం ఓటు బ్యాంక్ ఏక్కువగా నేపథ్యంలో తమకు కలిసి వస్తుందన్న అభిప్రాయంలో ఉన్నారు తమ్మినేని…ఇదే సందర్బంలో పొత్తుల్లో బాగంగా బీఆర్ ఎస్ కు టికెట్ వస్తే వారి గెలుపు కోసం పనిచేస్తాను..ఒకవేళ సీపీఏం కు వస్తే
తమకు కూడ సపోర్ట్ చేయాలని ఏమ్మేల్యే కందాలకు సూచిస్తున్నారు తమ్మినేని…తమ్మినేని కామెంట్స్ తో కందాల శిభిరంలో కొంత ఆందోళన ఇటివలే మొదలైంది…సీపీఏం కి ఒకవేళ పొత్తుల్లో బాగంగా టికెట్ ఇస్తే పరిస్తితేంటన్న డైలామా లో ఉన్నారు కందాల వర్గీయులు…మొత్తానికి పాలేరు బీఆర్ఎస్,సీపీఏం టికెట్ పంచాయతీ ఇంకా ఏన్ని మలుపులు తీరుగుతుందో ఏలాంటి ట్విస్ట్ లు ఉంటాయో చూడాలి