బిజెపిలో సీఎంకేసీఅర్ కోవర్టులు లేరు బండి సంజయ్
కోవర్టులు ఉన్నారని ఈటేల ఎందుకన్నారో తెలియదు

కరీంనగర్ .
ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్దమన్నారు బిజెపి రాష్ట్ర అద్యక్షుడు సంజయ్ ముందస్తు..ముందస్తు ఎన్నికల యుద్దానికి తాము సిద్దంగా ఉన్నామని. ఆయన కరీంనగర్ లో వెల్లడించారు.. బీజేపీలో కోవర్టులు ఉండరు అని స్పష్టం చేశారు.. తమది సిద్ధాంతం గల పార్టీ అన్నారు.. ఈటల అలా అన్నారని అనుకోవడం లేదన్నారు.. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతా సబ్సిడీ లను రద్దు చేశారనీ ఆరోపించారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలంగాణ అభివృద్ధి పై చర్చకు సిద్ధం అని ఛాలెంజ్ చేశారు బండి సంజయ్