అణా పైసా జీతం లేకుండా బోదన చేస్తున్నా అభినవ సావిత్రిబాయిపులే

దశాబ్ద కాలంగా విద్యార్థులకు ఉచిత బోదన చేస్తున్నా వీణా ఉపాద్యాయురాలు

.. అక్షరాలకు జీవితాన్ని అంకితం చేశారు.. అణా పైసా జీతం లేదు.. రాత్రి పగలు బోదన చేస్తున్నారు.. విద్యార్థులకు అక్షరాలను నేర్పుతున్నారు..విద్యార్థుల రాతను మార్చుతున్నారు..బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నారు..దశాబ్ద కాలంగా అక్షరాల వెలగులు ‌నింపుతున్నారు,.. కుమ్రంబీమ్ జిల్లాలో అబినవ సావిత్రి బాయిపులే పై ప్రత్యేక  కథనం

. కుమ్రంబీమ్ జిల్లా కేరిమేరి మండలం సావర్ కేడ గ్రామం…ఇది మారుమూల గ్రామం…నిరుపేదకుటుంబాలు నివసిస్తున్నా గ్రామం… గ్రామంలో ఉన్నత పాఠశాల ఉంది… పాఠశాలలో‌‌నూట యాబై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాని ఉపాద్యాయుల కోరత తీవ్రంగా ఉంది

. ప్రదానోపాద్యాయుడు రంగయ్య విద్యార్థులకు విద్యను అందించడానికి ఎంతో క్రుషి చేస్తున్నారు… కాని విద్యార్థులు ఉపాద్యాయులు లేక ఇబ్బందులు పడుతున్నారు… ఆ విద్యార్థుల. చదువులు కష్టాలను చూసి చలించిపోయారు వీణా ఉపాద్యాయురాలు.

. చదువుల కష్టాలను తోలగించడానికి పాఠాలు బోదించాలని నిర్ణయించుకున్నారు…బోదనలో చేపట్టారు వీణా ఉపాద్యాయురాలు..కాని సర్కారు నియమించిన. ఉపాద్యాయురాలు కాదు… అక్కడ ఉపాద్యాయునిగా పనిచేస్తున్నా రంగయ్య బార్యే వీణా ఉపాద్యాయురాలు…ఆమె కూడ చదువుల. యజ్నంలో బాగమైంది… పదిసంవత్సరాలుగా గ్రామస్తుల నుండి అణా పైసా జీతం తీసుకోలేదు..‌పోని పది తోమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం గంటలకు వెళ్లిపోయే ఉపాద్యాయురాలు అసలు కాదు.. పది సంవత్సరాలుగా గ్రామంలో అక్కడే ఉంటూ రాత్రి పగలు బోధిస్తున్నారు… విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు.. వారి బంగారి భవిష్యత్తు కు బాటలు వేస్తున్నారు వీణా ఉపాద్యాయురాలు..

. అబినవ సావిత్రి బాయి పులేగా వీణా ఉపాద్యాయురాలు విద్యను అందిస్తున్నారు… రాత్రి పూట విద్యార్థుల. ఇంటికి వెళ్లి బోదన చేస్తుండటం విశేషం…వీణా ఉపాద్యాయురాలు చదువుల సంకల్పం…విద్యార్థులను కదిలిస్తోంది.. ఆమే తో బోదనతో ఎంతో నేర్చుకుంటున్నామని చెబుతున్నారు విద్యార్థులు.

.. జీతం లేకుండా .. నిరుపేద. విద్యార్థుల జీవితాలను మార్చుతున్నా వీణా ఉపాద్యాయురాలును గ్రామస్థులు అభినందిస్తున్నారు..అత్యుత్తమైన బోదన చేస్తూ విద్యార్థులు ఎదగడానికి తోడ్పాటును అందిస్తున్నా వీణా సేవలు మరువలేమంటున్నారు..గంట ట్యూషన్లు చెబితేనే పీజులు వసూలు చేసే ఉపాద్యాయులు ఉన్నా ఈరోజుల్లో.. ‌పదిసంవత్సరాలు ఉచితంగా పాఠాలు బోదిస్తున్నా వీణా ఉపాద్యాయురాలుని అభినవ సావిత్రి బాయిగా పిలుస్తూ అందరు అభినందిస్తున్నారు గ్రామస్థులు

 

Leave A Reply

Your email address will not be published.