వర్షం కోసంపూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జోగురామన్న

శివునికి జలాబిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్

వర్షాలు సకలంగా కురవాలని పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులకు మంచి దిగుబడులు వచ్చేలా చూడాలని కోరుకుంటూ అదిలాబాద్ పట్టణంలోని తాటిగూడా లో ని ఆలయంలో ఏర్పాటు చేసిన గంగ నీళ్ల జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలతో కలిసి నీళ్లతో నిండిన కలశాన్ని ఎత్తుకొని ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి శివలింగానికి నీళ్లను సమర్పించారు.. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా పడాలని కోరారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారయ మనం ఉన్న లేకున్నప్పటికీని హిందూ ధర్మం రానున్న తరాలకు సైతం గుర్తుండి పోయేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కొరియాలంటే నాటినుండి నేటి వరకు పల్లెల్లో పట్టణాలలో కప్పతల్లి ఆటలు మల్లన్న పూజలు నీళ్ల జాతర వంటి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ భక్తిని చాటుతో వస్తున్నాం అన్నారు.. గంగపుత్ర సంఘ భవన నిర్మాణానికి 5 లక్షల తో స్థలాన్ని కేటాయించమన్నారు .భవన నిర్మాణానికి సైతం మరో 5 లక్షల తో నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.రానున్న రోజుల్లో పనిచేసే పార్టీలను మాత్రమే గుర్తించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనిఎమ్మెల్యే సూచించారు… ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చేర్మెన్ మెట్టు ప్రల్హాద్ , కౌన్సిలర్అశోక్ స్వామి, కో ఆప్షన్ సంజయ్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.