మహిళ సర్పంచ్ ను వేదించిన ఎమ్మెల్యే రాజయ్య
రాజయ్య టిక్కేట్ ఇవ్వవద్దంటున్నా మహిళ సర్పంచ్

…
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై దళిత మహిళా సర్పంచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వేధిస్తున్నారని ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య ఆరోపించారు. ఎమ్మెల్యే చేతిలో ఉండాలి.. ఆయన చేతిలో ఉంటేనే ఏమైనా సహకారం ఉంటుంది… ఆయన సహకారం లేకున్నా మంచిదే కానీ ఆయన చేతిలో ఉండలేక వేదింపులు భరించలేక మీడియాౠ ముందుకు వచ్చినట్లు తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసేటప్పుడు మగవాళ్ళు ఉండకూడదని, ఫోటోలు దిగేటప్పుడు అతన్ని అతుక్కుని ఉండాలని తెలిపారు. అలా ఉండకపోవడంతో ఓర్వలేఖపోతున్నాడని ఆవేదనతో చెప్పారు. దూరంగా ఉండకుంటే అందరి ముందు బొమ్మవా నువ్వు… రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు.. ఎంజాయ్ చేయవా అని కులపోళ్ళ ముందు ఇజ్జత్ తీశాడని తెలిపారు. నా బతుకును ఆగం చేయాలని ఓ మహిళా ప్రజాప్రతినిధి చూశారు కానీ ఆగం కాలేదన్నారు. తనను నాశనం చేయాలని చూసిన మహిళను సాటి మహిళగా వారిని నాశనం చేయదలచుకోలేదని చెప్పారు. తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యే తో పాటు మహిళ ప్రజాప్రతినిధి మరో అగ్రవర్ణ వ్యక్తి బాధ్యులని స్పష్టం చేశారు. వారి నుండి తనకు రక్షణ కావాలని కోరారు. కెసిఆర్ కేటీఆర్ కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా… డాక్టర్ రాజయ్యకు టికెట్ ఇవ్వద్దని కోరుతున్నానని తెలిపారు.
అలాంటివాళ్ళు ఉంటే ఆరాచకాలు ఉంటాయని తెలిపారు. కెసిఆర్ కేటీఆర్ రెండు చేతులు జోడించి చెబుతున్నా క్రింది స్థాయిలో ఏం జరుగుతుందో చూడండి.
రాబోయే కాలానికి కాబోయే సీఎం కేటీఆర్ మీ క్రింద పనిచేసే వారి పనితీరును పరిశీలించాలని కోరారు