వరంగల్ మార్కేట్ లో బారీ వర్షానికి తడిసిన మిర్చి

తడిసిన మిర్చిని కోనుగోలు చేయాలని అందోళన చెపట్టిన రైతులు

అకాల వర్షం వరంగల్ జిల్లా ఎనమామల మార్కెట్ లో మిర్చి రైతులను ఆందోళనకు గురి చేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో మార్కెట్లో వందలాది బస్తాల మిర్చి తడిసి ముద్దయింది. తడిసిన మిర్చికి బస్తాకు ఐదు కిలోలు కోత పెట్టాలని ఖరీదుదారులు, మిర్చివ్యాపారులు నిర్ణయించడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. సకాలంలో తాడిపత్రీలు, పరదాలు అందించడంలో మార్కెట్ అధికారులు విఫలం కావడంతోనే మిర్చి తడిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన మిర్చిని కోత లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే వ్యాపారులు తమ శ్రమ దోసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోత లేకుండా మిర్చి కొనుగోలు చేయకుంటే ఇక ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో అప్రమత్తమైన మార్కెటింగ్ అధికారులు రైతులు వ్యాపారులతో సమావేశం చర్చలు జరిపారు. మిర్చి తడవడానికి అధికారులు వ్యాపారులే కారణమని ఆరోపించారు. కోత లేకుండా కొనుగోలు చేస్తామని అధికారులు వ్యాపారులు హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు.

 

Leave A Reply

Your email address will not be published.