ముజ్గి మల్లన్నకు పూజలు నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

పల్లకిని దర్శించుకున్నా మంత్రి

నిర్మల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ముజ్గి మల్లన్న స్వామి పల్లకి గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసానికి చేరుకొంది. మంత్రి తన నివాసంలో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి మంత్రి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆలయ అభివృద్ధి కి రూ.40 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో పౌర్ణమి రోజున ప్రారంభమైన ఈ పల్లకి సేవ రెండు నెలలు పూర్తి చేసుకొని తిరిగి మాఘ పౌర్ణమిన గ్రామంలో కొలువై ఉన్న ఆలయానికి చేరుకుంటుందని ఈ నెల 4 న కల్యాణం,6 న రథోత్సవం, 8 న అగ్నిగుండ ప్రవేశంతో పాటు జాతర మహోత్సవం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశ్, లక్కడి జగన్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.