పదిహేడు ఇరవైమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందే మంత్రి ఎర్రబేల్లి

ప్రజల్లో వ్యతరేకత ఉన్నా ఎమ్మెల్యేను మార్చితే వందకు పైగా సీట్లు గెలుస్తాము

 

 

మహబూబాబాద్ జిల్లా  రాష్ట్రంలో  ప్రజల్లో  సీఎం కేసీఆర్  పై అబిమానం   ఉంది…  కోందరు ఎమ్మెల్యేలపై   వ్యతిరేకత ఉందని  రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం లో రేపు జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే 100కు పైగా సీట్లలో బిఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేశారు. ఏ సర్వే అయినా, తాను వ్యక్తిగతంగా చేసిన సర్వేలు చూస్తే 80 నుంచి 90 స్థానాల్లో బిఆర్ఎస్ గెలుస్తుందని తెలిందన్నారు.

 

 

సీఎం

కెసిఆర్ కు ఓటేస్తాం కానీ కొందరి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 15 నుంచి 20 స్థానాల్లో బిజేపి, 20 నుంచి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటి ఉంటుందని 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే బిఆర్ఎస్ వందకు పైగా స్థానాలు గెలుస్తుంది అన్నారు. ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మద్య పోటీ మరి కొన్ని చోట్ల బీజేపీ బిఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్నారు

Leave A Reply

Your email address will not be published.