జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేసిన. మున్సిపల్ కౌన్సిల్
జీఓ వచ్చిన తర్వాత. స్పందిస్తామంటున్నా రైతులు

పచ్చటి పంట భూములను మింగే మాస్టర్ ప్లాన్…ఆ ప్లాన్ తో అన్నం పెట్టే రైతులను అడ్డకూలీలుగా మార్చే ప్లాన్ పై రైతులు తిరగబడ్డారు…మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఊర్లు ఉద్యమం లా కదలాయి.. మున్సిపల్ క అదికారులకు దడపుట్టించారు.. ఆ ఉద్యమ సేగతఖ అదికారులు వెనక్కి తగ్గారు… మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది
జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుచేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముసాయిదా డ్రాఫ్ట్స్ ను రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ గత 10 రోజులుగా 6 గ్రామాల రైతులు, గ్రామస్తులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 15న మాస్టర్ ప్లాన్ ముసాయిదాకు ఓకే చెబుతూ కౌన్సిల్ తీర్మానం చేయగా నేడు రద్దుచేస్తూ తీర్మానం చేశారు. వారం 10 రోజులుగా రైతుల నిరసనలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాస్టర్ ప్లాన్ను సవరిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చైర్ పర్సన్ శ్రావణి, కలెక్టర్ రవి అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో గ్రామాలను పట్టణంలో కలవకుండా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి కమిటీని ఏర్పాటు చేయడానికి కౌన్సిల్ అమోద ముద్ర వేసింది
మున్సిపల్ సమావేశం అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. తాము రైతుల పక్షాన ఉన్నామనీ అన్నదాతలకు అన్యాయం చేసే పని చేయమని స్పష్టం చేశారు.. రైతుల శ్రేయస్సు కోసమే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. ప్రతిపక్షాలు రాజకీయం చేసి లబ్ది పొందాలని చూషాయని విమర్శించారు సంజయ్
మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. రైతులకు అన్యాయం జరిగే మాస్టర్ ప్లాన్ ను కౌన్సిల్ రద్దు చేస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతించారు.. రైతుల ఉద్యమం తోనే ప్రభుత్వం దిగి వచ్చిందని వ్యాఖ్యానించారు.. ప్రభుత్వం కూడా వెంటనే ఆ తీర్మానాన్ని అధికారికంగా ఆమోదించి జీఓ విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు.. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి ఖండించారు..
జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదిత గ్రామాల రైతులు జరుగుతున్న పరిణామాలు నిశితంగా గమనిస్తున్నారు.. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేశాక ఆయా గ్రామాల రైతులు స్పందించలేదు.. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అధికారికంగా రద్దు జీఓ వెలువడ్డ తర్వాతనే స్పందించాలని బావిస్తున్నారు.