అసుపత్రిలో బెడ్ పై పెళ్లి
అనారోగ్యం వదువుకు అసుపత్రిలో తాళి కట్టిన వరుడు

మంచిర్యాలలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది…… ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్న వధువుకు వరుడు ఆసుపత్రిలోనే తాళి కట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు…… చెన్నూరు మండలం లంబడి పల్లికి చెందిన శైలజ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి గురువారం వివాహం జరగవలసి ఉంది….. అయితే బుధవారం ఆమె అస్వస్థత గురైంది……వెంటనే మంచిర్యాలకు తీసుకువచ్చారు….. ఓ ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ జరిగింది…..పెండ్లి వాయిదా పడవద్దు అనే ఉద్దేశంతో వరుడు ఆసుపత్రిలోనే బెడ్ పై ఉన్న శైలజకు తాళికట్టి కట్టారు…..ఈ సన్నివేశాన్ని చూసి ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు