పోడుభూములకు సంతకాలంటే సమరం తప్పదు
తీర్మానాలు వద్దంటూ తిరగబడుతామంటున్నా అదివాసీలు

ఆదిలాబాద్
అదివాసీల.పై సీఎం కెసీఅర్ వరాల జల్లు కురపించారుపోడు భూముల హక్కులు ఇస్తామని బరోసానిచ్చారు…. .. ఆ ప్రకటన. అదివాసీ బిడ్డలలో పండుగను కళను తెచ్చింది….కాని నిబంధనలే ఆ పండగపై నీళ్లు చల్లాయి… అదివాసీలకు నిరాశను మిగిల్చాయి… పోడు భూములు ఇవ్వడానికి ఆఖిల పక్షం తీర్మానాలు వద్దంటున్నారు.. తీర్మానాలు అమలు చేస్తే అదివాసీలు తిరుగుబాటు చేస్తామంటున్నారు…. పోడుభూముల పై అగ్గిరాజేస్తున్నా అఖిలపక్ష. తీర్మానాల పై ప్రత్యేక కథనం
.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో అదివాసీ బిడ్డల పై వరాల వర్షం కురిపించారు.. పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామన్నారు… దళిత బందు మాదిరిగా గిరిజనులకు గిరిజన బందు అమలు చేస్తామని అన్నారు.. పదకోండు లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.. కాని పట్టాల పంపిణీకి నిబంధనలు అమలు చేస్తామని ప్రకటించారు సీఎం.
.. అందులోబాగంగా పోడు భూముల పంపిణీ కి అఖిలి పక్షం, గ్రామ సభలు తీర్మానం చేయాలంటున్నారు… ప్రదానంగా ఒకసారి పోడుభూములు తీసుకున్నా తర్వాత మళ్లీ కోట్టమని తీర్మానాలు చేయాలని సీఎం కేసీఆర్ మేలిక పెట్టారు… ఆ తీర్మానాలు చేస్తేనే పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామంటున్నారు సీఎం కేసీఆర్ …
.. అయితే ఆఖిల పక్ష, గ్రామాలు తీర్మానం చేస్తే పట్టాలు ఇస్తామని సీఎం కేసీఅర్ ప్రకటనను ఉమ్మడి అదిలాబాద్ లో అదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు…ఏ పథకానికి అమలు చేయడానికి సర్కారు అఖిల పక్షం, గ్రామ సభ తీర్మాలను ప్రతిపాదికగా తీసుకోలేదు.. అలాంటిది పోడు భూములకు పంపిణీకి ఎందుకు తీర్మానాలు చేయాలని నిబంధనలు పెడుతున్నారని అదివాసీ తుడుం దెబ్బ. జిల్లా అధ్యక్షుడు గణేష్ సీఎం కేసీఆర్ పై మండిపడుతున్నారు.
.. ఆఖిల పక్షం , గ్రామ సభల. తీర్మానం నిబంధనలు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.. కుమ్రంబీమ్ జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షుడు విజయ్
పట్టాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని అదివాసీలు ఆరోపిస్తున్నారు… వెంటనే తీర్మానం నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు…ఒకవేళ తీర్మానాలు అమలు చేస్తామంటే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు… తీర్మానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామంటున్నారు..సర్కార్ దిగివచ్చి తీర్మానం లేకుండా పట్టాలు ఇస్తామనేంత వరకు పోరాటం చేస్తామని సర్కార్ హెచ్చరికలు జారీచేశారు. ఆఖిల పక్షం తీర్మానాలు అమలు తప్పనిసరి చేయడాన్ని అదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ప్రజల్లో కూడ సర్కారు తీరు పై విమర్శలు వినిపిస్తున్నాయి … మరి అదివాసీ ప్రజల్లో తీర్మానాలకు వ్యతిరేకంగా వ్యతిరేకతను చూసి తీర్మానాలు ఉపసంహరించుకుంటుందో లేదో చూడాలి..