పోలీసుల అదుపులో పరీక్షను కోనుగోలు చేసిన నిందితులు

మహబూబ్ నగర్ జిల్లాలో కోనసాగుతున్నా సిట్ విచారణ

 

 

మహబూబ్  నగర్

-రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నా టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పాలమూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది .మొదట తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఉండడం ఉత్కంఠ రేపుతోంది’. తాజాగా మరోకరిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకోవటంతో సంచలనంగా మారింది.షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి కూడ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్న నేపధ్యంలో ఈ లీకేజీ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు జల్లెడ పడుతుండడం ఉత్కంఠ రేపుతోంది.

– టీఎస్‌పీఎస్‌సీలో పేపర్ లీకేజీ వ్యవహరం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుండగా నిందితుల్లో చాలా మంది ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారుండటం చర్చనీయాంశంగా మారింది.గండీడ్ మండలానికి చెందిన రేణుక,డాక్యా దంపతులు.రేణుకకు టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తున్న ప్రవీణ్‌ ఏర్పడిన పరిచయంతో పేపరు లీకేజి పాల్పడి ఏఈ పరీక్షల పేపరు సంపాదించి తనసోదరుడు రాజేశ్వర్‌తో గండీడ్‌ మండలం మన్సూర్‌పల్లి తండాకు చెందిన కేతావత్‌ నీలేశ్‌ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్ర నాయక్, వికారాబాద్‌ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్‌ గోపాల్‌ నాయక్‌కు ఒక్కొక్కరికి పదిలక్షల చొప్పున పేపరు విక్రయించినట్టు తెలుస్తోంది.లీకేజీ వ్యవహరం బయటపడటంతో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.అయితే ప్రవీణ్‌ గ్రూపు 1 పరీక్ష రాయటంతో అది కూడ లీకై ఉంటుందని భావించిన టీఎస్‌పీఎస్‌సీ అదికారులు గ్రూప్‌ 1ను కూడ రర్దు చేసింది.ఈ క్రమంలో సిట్‌ అధికారుల విచారణలో వరుసగా జరుగుతున్న అరెస్టుల్లో నిందితులు ఇస్తున్న సమాచారం మేరకు పోలీసులు తమ దర్యాప్తు వేగవంతం చేశారు.మరో నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బంధువు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రశాంత్‌రెడ్డిని సిట్‌ పోలీసులు  అరెస్టు చేశారు.ఇతను నవాబ్‌పేట మండలంలో ఉపాధిహామీ పథకంలో కాంట్రాక్టు పద్దతిలో ఇంజనీరింగ్ కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు.ఇతనికి గ్రూపు 1లో వందకుపైగా మార్కులు వచ్చినట్టు తెలుస్తోంది.ఇతను ప్రశ్నాపత్రాన్ని ఏడున్నర లక్షలకు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.నిన్నఎంపీడీఓ కార్యాలయంలో మీటింగ్‌లో ఉన్న ప్రశాంత్‌రెడ్డిని సిట్‌ అదికారులు అదుపులోకి తీసుకుని అర్దరాత్రి వరకు విచారించి వివరాలు రాబట్టారు.ఆర్టీజీఎస్,గూగుల్‌పే,ఫోన్‌పే ద్వారా ప్రశాంత్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి డబ్బులు చేరవేసినట్టు సిట్ అదికారులు గుర్తించారు

 

 

.అనంతరంప్రశాంత్రెడ్డినిహైదరాబాద్‌కతరలించారు.ఇతనితోపాటు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మరో ముగ్గురు కూడ డబ్బులిచ్చి పేపరు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.అందులో ఓ వ్యక్తి కోసం అధికారులు అక్కడికి వెళ్లగా అతను పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు మహబూబ్‌నగర్‌లో రేణుక అద్దెకు ఉంటున్న ఇంటివద్ద కూడ సిట్ అదికారులు విచారణ చేసినట్టు చెబుతున్నారు.ఇంటి యజమానితో పలు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.మొత్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ  పరీక్షను కోనుగోలు  చేసిన వారికి  పోలీసుల విచారణ.  దడపుట్టిస్తోంది

 

Leave A Reply

Your email address will not be published.