ములుగులో కిలాడీ లేడీలు

సిని పక్కీలో చోరిచేస్తున్నా మహిళలు

ములుగు జిల్లా కేంద్రంలోకిలాడి లేడీలు  దడపుట్టిస్తున్నారు..     సినీ పక్కిలో చోరీ చేస్తున్నారు. షాప్ ముందు పార్క్ చేసిన బైక్ నుంచి 2 లక్షల 80 వేల రూపాయలను మహిళా దొంగలు ఎత్తుకెళ్లారు.‌
కాసిందేవిపేట సర్పంచ్ అహ్మద్ పాషా ములుగులో షాప్ ముందు బైక్ పార్క్ చేసి ‌షాప్ లోకి వెళ్ళగా మహిళా బైక్ నుంచి క్యాష్ బ్యాగ్ అందుకుని పరార్ అయ్యింది. ఆమెతో ఉన్న గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయారు. చోరీ విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులు పాత నేరస్తులుగా భావిస్తు అనుమానితుల ఫోటోలు పోలీసులు విడుదల చేశారు. అనుమానితులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ములుగు సిఐ కోరారు.  సి సి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.
….

Leave A Reply

Your email address will not be published.