ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పై కేటీఅర్ సంచలనవ్యాఖ్యలు
పార్లమెంట్ రద్దు చేసి... ఎన్నికలకు వస్తే..మేము అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం మంత్రి కేటీఅర్

ముందస్తు ఎన్నికల యుద్దానికి సై మంత్రి కేటిఅర్ .. బిజెపి పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికల యుద్దానికి సిద్దమైతే…. తాము ముందస్తుకు సిద్దమని బిజెపికి మంత్రి సవాల్ విసిరారు…రాబోయే ఎన్నికల. అసెంబ్లీ ఎన్నికల కోసం శ్రేణులు సిద్దంకావాలని కేటీఅర్ ఎన్నికల శంఖరావాన్ని పూరించారు
. నిజామాబాద్ లో మంత్రి. కేటీఅర్ పర్యటన రాజకీయ వేడిని పెంచింది…యాబై కోట్లతో నిర్మించనున్నా కళబారతిని పనులను మంత్రి ప్రారంభించారు… ఆనంతరం కమాన్ వద్ద అండర్ బ్రిడ్జీని ప్రారంభించారు.ఆనంతరం మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, స్థానిక ఎంపీ అరవింద్ కు సవాళ్లు విసురుతూ మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. … తాము ముందస్తుకు సిద్దమన్నారు… బిజెపి పార్లమెంటు రద్దు చేసి ఎన్నికలకు వస్తే ఎన్నికలకు సిద్దమని మంత్రి సవాల్ విసిరారు..కాని తమకు ముందస్తుకు వెళ్లాలనే అలోచనల లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అరవింద్ ఏం తీసుకొచ్చాడో చెప్పాలంటూ ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదన్నారు. మోడీ ప్రభుత్వం మాటలేమో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటాయని… కానీ, అంతా సబ్ కా సబ్ పక్వాజ్ అంటూ తన మార్క్ సెటైర్స్ విసిరారు కేటీఆర్. విభజన చట్టంలో ఏ హామీ నెరవేర్చలేదని… వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ లోనైనా రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి బండి సంజయ్, నిజామాబాద్ కు నిధులు తెచ్చి అరవింద్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న మోడీ… జూట్ బోర్డును కూడా ఎత్తేసారంటూ ఎద్దేవా చేశారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఇకపై ఊరుకోమన్నారు కేటీఆర్. ఢిల్లీ బీజేపోళ్లు తెలంగాణాకు అవార్డులిస్తే.. గల్లీ బీజేపోళ్లేమో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. 2014కు మందు 14 మంది ప్రధానులు పనిచేస్తే వాళలంతా కలిసి 67 ఏళ్లలోపు 56 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోడీ ఒక్కడే ఈ ఎనిమిదేళ్లలో వంద లక్షల కోట్లు అప్పులు చేశాడని ఆరోపించారు కేటీఆర్. కేసీఆర్ అప్పులు చేసి ఉత్పాదక రంగంలో పెట్టుబడిగా పెడితే.. మోడీ కార్పోరేట్ శక్తుల పప్పుబెల్లాల్లా పంచిపెట్టారన్నారు. మోడీని దేవుడంటున్నారంటూ పరోక్షంగా బండి సంజయ్ పై ఆరోపణలు గుప్పించిన కేటీఆర్.. చేనేతపై జీఎస్టీ వేసినందుకు, పెట్రో, డీజిల్ ధరలు పెంచినందుకు, రైతుల కోసం నల్లచట్టాలను తెచ్చినందుకా మోడీ దేవుడని ప్రశ్నించారు కేటీఆర్. రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వాలే ఉన్న మహారాష్ట్ర, కర్నాటకల మధ్య పంచాయితీ తెంపలేని మోడీ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతికి బీజం వేశాడనడం హాస్యాస్పదమన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ చెప్పినట్టు నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్… ప్రాఫిట్స్ ఆఫ్ ప్రైవేట్ అన్నట్టుగా మోడీ సర్కారు తీరు తయారైందన్నారు. పీఎం కిసాన్ లో కూడా తెలంగాణాలో ఇచ్చినట్టుగా ఎకరానికి ఐదువేల చొప్పున ప్రతీ ఏటా పదివేల రూపాయలివ్వాలని డిమాండ్ చేసిన కేటీఆర్… నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటు… తెలంగాణాలోని ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉన్న బండి, అరవింద్ ఈ పనులు చేయాలన్నారు.
నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో టెక్నాలజీ ఫర్ ఇంప్యాక్ట్ అండ్ స్కేల్ పేరుతో కాకతీయ స్యాండ్ బాక్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొట్టమొదట పాల్గొని మాట్లాడిన కేటీఆర్… దేశంలో జరగాల్సిన రీతిలో ఇంకా అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణాలో జీఎస్డీపీతో పాటు.. ఏ ఏ రంగాల్లో ఎలా అభివృద్ధి సాధించామో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాడరేటల్ దేశ్ పాండే సంధించిన ప్రశ్నలకు ఫైర్ సైడ్ ఛాట్ లో భాగంగా సమాధానాలిచ్చారు కేటీఆర్. ఆ తర్వాత కాకతీయ స్యాండ్ బాక్స్ ఆధ్వర్యంలో రైతులకందుతున్న సేవల గురించి ఐదు జిల్లాల రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. తెలంగాణాలో ఐదు కీలకంగా వచ్చిన విప్లవాలపై రైతులకు వివరించారు.
మిషన్ కాకతీయలో చెరువుల అభివృద్ధితో రాజన్న సిరిసిల్లలో 6 మీటర్ల పైకి నీళ్లు ఉబికివచ్చిన ఘటనలు ఉన్నాయన్నారు.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లకు శిక్షణనిచ్చే ముస్సోరీ వంటి చోట్ల కేస్ స్టడీస్ గా మారాయన్నారు రైతులతో ముఖాముఖిలో మంత్రి కేటీఆర్. కాళేశ్వరం వల్ల 45 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందని.. రాబోయే రోజుల్లో జనాభా పెరుగుదలకనుగుణంగా కాళేశ్వరం ఉపయోగపడనుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో గతంలో 26వ స్థానంలో ఉన్న తెలంగాణా.. ఇప్పుడు 3 వ స్థానానికెగబాకడం అభివృద్ధా కాదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పదివేల ఎకరాల్లో 16 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారాయన.
మంత్రి కేటీఆర్ పర్యటన రాజకీయాల వేడిని పెంచింది. .. మరోవైపు నిరసనల సేగ. మంత్రిని తాకింది.. కలెక్టరేట్ నుంచి భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ కు వెళ్లే మార్గంలో కంఠేశ్వర్ వద్ద కార్పోరేటర్ గడుగు రోహిత్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు పలు సమస్యలపై ప్రశ్నిస్తూ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కు అడ్డుతగలారు. దాంతో ఉద్రిక్తత నెలకొంది.అడ్డుపడిన వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఎల్లమ్మగుట్టలో అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ ను ప్రారంభించి… ఇందూరు కళాభారతి నిర్మాణానికి భూమిపూజ చేసి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకునే క్రమంలో బీజేపి నేతలు మరోసారి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కు అడ్డు తగిలారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు బీజేపి నేతలపై లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ టూర్ నేపథ్యంలో… విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు అడ్డుకుంటామని హెచ్చరించడంతో అప్రమత్తమైన పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేయడంతో పాటు… నిన్న అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగించారు… అయినప్పటికీ అందోళనల పర్వం కోనసాగడం విశేషం