మా పీఏ తిరుపతి ఊర్లో ఒక్కరు పాస్ కాలేదు
ముగ్గురు రాస్తే ఒక్కరు పాస్ కాలేదన్నా మంత్రి కేటీఅర్

రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల పట్టణం పద్మనాయక కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.కేసీఆర్ కు చరిత్ర తిరగ రాస్తారన్న పేరుంది . బిజెపి నాయకులు పేపర్ లీకేజిలో ముఖ్యమంత్రి ని బ్రోకర్ అన్నారు .నేను మీ మోదీ అదానికి బ్రోకర్ అని చెప్పలేనా ..కానీ నేను చెప్పనన్నారు ..బండిసంజయ్ రేవంత్ రెడ్డికి అసలు జీవితం లో పరీక్షలు రాశారా ప్రశ్నించారు నిజామాబాద్ ఎంపీ నకిలీసర్టిఫికెట్లుపెట్టిదొరికిపోలేదన్నారు.మల్యాల మండలంలో 415 మంది పరీక్ష రాస్తే 35 మంది క్వాలిఫై అయ్యారని స్పష్టం చేశారు.మా పీఎ తిరుపతి స్వగ్రామంలో ముగ్గురు రాస్తే ఒక్కరు కూడా పాస్ కాలేదన్నారు.దొంగల పైసలతో ఎమ్మెల్యేలు కొనాలే ..ఎకనాధషిండేలను సృష్టించాలి అనేది బిజెపి పార్టీ ఎత్తుగడన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3250 మంది పరీక్షలు రాస్తే 255 మందికి 25 నుంచి 90 మార్కులు వచ్చాయి ..పాపం ఒక్కరికి కూడా 100మార్కులు రాలేదన్నారు
తెలంగాణాను శత్రు దేశంగా చూసినట్లు తెలంగాణ పుట్టుకనే అవమానించింది ఈ మోదీ కాదా?ఇంకా కరంటు బిల్లులు పెంచాలని చెబుతోంది సిగ్గు లేని కేంద్రమని అన్నారు.బొగ్గు 3 వేలకు టన్ను వదిలిపెట్టి 30 వేలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోమన్నారు.అక్టోబర్ , నవంబర్ ,డిశంబర్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దక్షణ భారత్ దేశంలో ఢంకా బజాయించి హ్యాట్రిక్ గెలుపు సాధించాలన్నారు.చాలా మంది ముఖ్యమంత్రులున్నారు గెలిచినా ఇంతవరకు వరసగా మూడుసార్లు గెలిచిన సీఎంలు లేరు ..ఈసారి రికార్డ్ బ్రేక్ చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ లేకపోతే మాకు పదవులు లేవు ..గుర్తింపు లేదు ..ఎన్నికలున్నా లేకున్నా నాకు పార్టీయే ముఖ్యమన్నారు.హనుమంతుని గుడి లేని గ్రామం లేదు.. కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదన్నారు ..ఇది నిజమన్నారుమొన్ననే ముఖ్యమంత్రి పంట దెబ్బ తిన్న ప్రాంతాల్లో హెక్టారుకు 25000 పరిహారం ఇస్తామన్నారు ..దేశంలోనే ఈ స్థాయిలో ఇచ్చిన సీఎం ఉన్నాడా ..బండి సంజయ్ ని చెప్పాలని డిమాండ్