కోత్తగూడేం బిఅర్ ఎస్ టిక్కేట్ హెల్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కు దక్కుతుందా?
అసక్తిగా మారుతున్నా సమీకరణాలు

బ్యాలెట్ యుద్దానికి సిద్దమవుతున్నా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. గులాబీ టిక్కెట్ నాదేనంటున్నా హెల్త్ డైరెక్టర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎసరు పెడుతున్నాదేవరు.. వనమాకు సన్ స్ట్రోక్ తప్పదా?. కొత్తగూడెం నియోజకవర్గంలో మారుతున్నా సమీకరణాలపై ప్రత్యేక కథనం..
..సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 2లక్షల18 వేల మంది ఓటర్లు ఉన్నారు..మొత్తం 5 మండలాలు ఉన్నాయి..
కొత్తగూడెం,పాల్వంచ,సుజాతనగర్,చించుపల్లి,లక్ష్మిదేవిపల్లి మండలాలు ఉన్నాయి..కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది..ఇది పాల్వంచ పట్టణంలో ఉంది..అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా ఉంది..సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణంగా పిలుస్తారు.
..కొత్తగూడెం నియోజకవర్గ పాలిటిక్స్ అంత డిఫరెంట్ గా ఉంటాయి..ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పాలి.. అభ్యర్థుల గెలుపు ఓటములపై ఇవే ప్రభావం చూపిస్తూ ఉంటాయి..కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు రెండు బలంగా ఉన్నాయి..
..1999,2004 లో కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వర్ రావు గెలుపోందగా..2009లో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు గెలుపోందారు.
2014లో టిఆర్ఏస్ నుంచి జలగం వెంకట్రావు గెలుపోందారు..2018లో కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వర్ రావు గెలుపోందారు…తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు హస్తం పార్టీని విడి కారెక్కేశారు..దీంతో కొత్తగూడెం నియోజకవర్గం టిఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది..వనమా టిఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి వనమా, జలగం మధ్య ఓల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది..ఇదే సమయంలో జలగం వెంకట్రావు పార్టీ కూడా మారతారని ప్రచారం జరుగుతూ వచ్చింది.. ఆయన మాత్రం పార్టీ మార్పు ను ఖండిస్తూ సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు..
అయితే ఇటివలే ఖమ్మం లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ కు జలగం వెంకట్రావు హజరయ్యారు.అప్పటి నుండి పార్టీలో మళ్లీ యాక్టీవ్ అయ్యారు.
..కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ పార్టీ మూడు గ్రూపులుగా వీడిపోయింది..సిట్టింగ్ ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వర్ రావు,మాజీ ఏమ్మేల్యే జలగం వెంకట్రావు,
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ముగ్గురు మూడు గ్రూప్ లుగా వీడిపోయి కొత్తగూడెం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు..ప్రస్తుతం ముగ్గురు టికెట్ పై దీమాతో ఉన్నారు..మరోవైపు సీపీఐ పార్టీ సైతం బీఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో పోత్తు ఉంటుంది పోత్తుల్లో బాగంగా కొత్తగూడెం టికెట్ తమకే వస్తుందన్న దీమాతో ఉంది…సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటి చేయాలని డిసైడ్ అయిపోయారు..ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడ ప్రారంభించారు..
..ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే స్తానికంగా కాంగ్రెస్ క్యాడర్ బలంగానే ఉంది…వనమా వెంకటేశ్వర్ రావ్ టిఆర్ఏస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ లో గందరగోళ పరిస్తితి ఏర్పడింది..పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయింది..మాజీ ఏమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్ రావు,ఏడవల్లి కృష్ణ,నాగ సీతారాములు ముగ్గురు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు..అంతేకాదు పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు సైతం మూడు గ్రూపులుగా చీలిపోయి చేస్తు ఉంటారు..బీజేపీ నుంచి కొనేరు చిన్ని ఇంచార్జీగా ఉన్నారు..పార్టీ కార్యక్రమాలను బలంగా చేస్తు ముందుకు వెళ్లుతున్న బీజేపీ కి స్తానికంగా అంతగా మైలేజ్ రాని పరిస్తితి ఏర్పడింది..కాంగ్రెస్,టిఆర్ఏస్ నుంచి భారీ చేరికలు ఉంటే తప్ప కొత్తగూడెంలో బీజేపీ రేసులోకి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు..
..వనమా వెంకటేశ్వర్ రావ్ కొడుకు వ్యవహరాలతో లోకల్ గా కొంత మైనస్ వచ్చింది..గత ఏడాది జనవరిలో పాల్వంచలో జరిగిన వనమా రాఘవ ఇష్యూ తో వనమా కుటుంబంకు పెద్ద మచ్చనే వచ్చింది…ఒకానోక సందర్బంలో ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వర్ రావు కోడుకు రాఘవేందర్ చేసిన ఘనకార్యంతో ఏమ్మేల్యే పదవే పోయేటట్లు వచ్చిందని ఆందోళన పడాల్సిన పరిస్తితి కి వచ్చింది.ఆ తర్వాత రాఘవేందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం నియోజకవర్గంలో అడుగుపెట్టవదని పార్టీ అధిష్టానం సూచించడంతో కొంత వేడి చల్లారింది…కొడుకు ను వనమా ఏంత పక్కన పెడితే అంతా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు లోకల్ జనం చర్చించుకుంటున్నారు..
..అయితే ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులను పూర్తి చేయిస్తు జనంకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు…కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించుకోవడం,
కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించడం ఏమ్మేల్యే వనమా కలిసి వచ్చే అంశాలు…
..మొత్తానికి కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ లు మూడు గ్రూప్ లు గా చీలిపోయాయి..దీంతో ఇప్పటి నుంచి టికెట్ల పంచాయతీ మొదలైంది..అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్,
కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటి నెలకోనే అవకాశాలు కనిపిస్తున్నాయి..