కోండగట్టులో చోరి చేసిన దోంగల అరేస్ట్
ఎనిమిది మంది దోంగలను బీదర్ లోఅరెస్ట్ చేసిన పోలీసులు

కరీంనగర్ జిల్లా
కొండగట్టు ఆలయంలో చోరికి పాల్పడ్డ దొంగలను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో పట్టుకున్నారి పోలీసులు. చోరికి గురైనా 60 శాతం పైగా ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన ఎనిమిది మందిగా గుర్తించారు పోలీసులు.దొంగతనాలు చేస్తూ బీదర్ లో ఉంటూ చోరీ చేసిన వస్తువులను కర్ణాటక లోని వివిధ ప్రాంతాలలో అమ్ముతున్నారు దొంగలు.కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గత శుక్రవారం నాడు దొంగతనం జరిగింది. తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం15 కిలోల వెండి అపహరణ చేశారు.కొండగట్టు ఆలయం వెనుక వైపు నుంచి అర్ధరాత్రి దాటాక 1.20 నిమిషాలకు చొరబడి తిరిగి అదే వెనుక వైపు గుట్ట నుంచి కిందకు దిగి వెళ్ళారని విచారణలో తెలింది..చోరి తర్వాత. మెయిన్ రోడ్డుకు వెళ్లి బైకుల పై కోరుట్ల మెట్ పల్లి మీదుగా కామారెడ్డి నారాయణ్ ఖెడ్ బీదర్ వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు.. చోరికి గురైనా అభరణాలు రికవరీ చేస్తామంటున్నారు పోలీసులు