కోండగట్టు పై సీఎం కేసీఅర్ వరాల జల్లు

వంద కోట్లతో అబివ్రుద్ది చెస్తామని ప్రకటించిన సీఎం

జగిత్యాల

కొండగట్టు హనుమాన్ దేవాలయం దేశంలోనే అతి పెద్ద ఆంజనేయ క్షేత్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.. అవసరం అయితే వెయ్యి కోట్లు కూడా కేటాయిస్తామని ప్రకటించారు.. దాదాపు మూడు గంటలు కొండగట్టులో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి వరాల జల్లు కురిపించారు..

 

 

 జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు..దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టునుతీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంచేశారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారినిదర్శించుకున్న అనంతరం అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నక్షేత్ర అభివృద్ధికి అదనంగా ఇప్పటికే 100 కోట్లు కేటాయించారు సీఎం.. అయితే ఆ నిధులు సరిపోవని అధికారులు చెప్పారు.. మరో 500 కోట్లు అవసరం అవుతాయని చెప్పగా వెయ్యి కోట్లు అయినాకేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు..

 

సీఎం కేసీఆర్ తొలుత కొండగట్టు ప్రాంతంలో
ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం బస్సులో
ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ
పండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం
పలికారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత
తొలిసారి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న
క్షేత్రానికి వచ్చిన కేసీఆర్.. స్వామివారికి ప్రత్యేక
పూజలు చేశారు. ఆలయ పండితులు సీఎం
కేసీఆర్కు వేదాశీర్వచనం అందించారు.

అనంతరంఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించిఅధికారులతో కేసీఆర్ దాదాపు రెండు గంటలకుపైగా సమీక్షించారు. కొండగట్టు అభివృద్ధికి ఉన్నఅనుకూల, ప్రతికూల అంశాలపై లోతుగా
విశ్లేషించారు.

 

 

దేశంలో  అతి పెద్ద హనుమాన్ క్షేత్రం అంటేకొండగట్టే అని ప్రపంచాన్నే ఆకర్షించే అద్భుతఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. భక్తులకు అన్నివసతులు, సకల హంగులతో అభివృద్ధి చేయాలనిప్రమాదాలకు తావులేకుండా ఘాట్ రోడ్డులనుమార్చాలని ఆదేశించారు..సుమారు 850 ఎకరాల్లో ఆలయఅభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని పెద్దవాల్,పుష్కరిణి, అన్నదాన సత్రం, పార్కింగ్ ఏర్పాటుచేయాలి. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతికొండగట్టులో జరగాలని సూచించారు.. వేలాది మంది ఒకేసారిహనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలోఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. 86 ఎకరాల్లోసువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. తొలుత
ప్రకటించిన రూ.100కోట్లకు అదనంగా మరో
రూ.500 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని మళ్లీ
వస్తానని ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష
నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.