వరంగల్ తూర్పు నియోజకవర్గం పోటీ చేస్తాము కోండా

ఈ నెల. తోమ్మిది నుండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తాం

వరంగల్

వచ్చే ఎన్నికల్లో రెండు మూడు కాదు ఒకే స్థానంలో పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి స్పష్టం చేశారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో మా ప్రయాణం సాగింది… నేడు రేవంత్ రెడ్డితోనే మా ప్రయాణం ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రపంచంలోనే గొప్పదని అదే స్పూర్తితో వరంగల్ తూర్పులో ఈనెల 9 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాదిరిగా మాయమాటలు చెప్పనని, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు…ప్రజా సేవా ముఖ్యమని తెలిపారు. వరంగల్ లో భూ కబ్జాలు చూస్తే భాదనిపిస్తోందన్నారు. కబ్జాదారుల పై వరంగల్ సీపీ కొరడా ఝుళిపించడాన్ని స్వాగతిస్తు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.