అగ్ని పథ్ ఎంపిక కాలేదని యువకుని అత్మహత్య
మద్యవర్తులకు మాముళ్లు ముట్టజెప్పిన యువకుడు

ఆదిలాబాద్
. అగ్నిపథ్ చేరాలనుకున్నాడు..మద్యవర్తులకు మాముళ్లు ముట్టజెప్పాడు…అప్పులు తెచ్చి మాముళ్లు ముట్టజెప్పినా ఉద్యోగం రాలేదు. దాంతో మనస్థాపానికి గురయ్యాడు యువకుడు కార్తిక్… ఆ మనస్థాపంతొనే కార్తిక్ ఆదిలాబాద్ జిల్లా కప్పర్ల గ్రామంలో పురుగుల మందుత్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. అప్పు తెచ్చి మాముళ్లు ఉద్యోగం రాలేదని , అందువల్ల అత్మహత్యకు పాల్పపడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు…తమ కోడుకు మరణానికి కారణమైన. లంచాల. పై విచారించాలని.. బాద్యుల పై చర్యలు చేపట్టాలని బాదిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.. కార్తీక్ అత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ. జరుపుతున్నారు