మాజీమంత్రి జూపల్లి దారేటు?

కాంగ్రేస్ లో చేరుతారా?కమలం గూటికి వెళ్లుతారా?

 

పదవులు శాశ్వతంకాదు..ప్రజల శాశ్వతమన్నారు… పార్టీ పై ధిక్కార స్వరం  వినిపించారు..సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సందించారు..  సర్కారు  వైపల్యాలపై  తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు… పార్టీగీత. దాటిన మాజీమంత్రి జూపల్లి  క్రుష్ణరావు దారేటు. పై   ప్రత్యేక కథనం

 

మాజీ మంత్రి జూపల్లి అసంత్రుప్తితో   రగిలిపోతున్నారు.గడచిన కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ నాయకుడు ఇప్పుడు పార్టీ అధినేతపైనే తీవ్ర విమర్శలు చేయటంపై ఆగ్రహించిన అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.ఇన్నాళ్లు పార్టీ నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన బహిరంగంగా ఎక్కడ పార్టీపై విమర్శలు చేయలేదు .కాని ఒక్కసారిగా దిక్కార స్వరం వినిపించటంతో అంతే ధీటుగా పార్టీ కూడ స్పంధించింది.పార్టీపైన విమర్శలు చేసేవారు ఎంతటివారైనా క్రమశిక్షణా చర్యలు తప్పవనే సంకేతాలు ఇచ్చేందుకే వేటు వేసినట్టు అవగతమవుతుంది.జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంచలనంగా మారింది

–ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూపల్లి కృష్ణారావు బలమైన సీనియర్ నాయకుడిగా ఎదిగారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 5 సార్లు విజయం సాధించి అటు కాంగ్రేస్,ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.తన సొంత నియోజకవరంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.ఇక తనకు తిరుగులేదని భావించిన జూపల్లికీ 2018 లో జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు అనూహ్యమైన తీర్పు నిచ్చి ఓటమిని కట్టబెట్టారు.కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది భీరం హర్షవర్దన్‌రెడ్డి విజయం సాధించారు.కొల్లాపూర్ లోకాంగ్రేస్ నుంచి గెలిచినఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరటంతో సీన్‌ మారిపోయింది. వ్యూహత్మకంగానే సొంతపార్టీ నేతలు కొందరు జూపల్లికి చెక్‌ పెట్టేందుకు హర్షవర్ధన్‌రెడ్డిని పార్టీకి తీసుకొచ్చారనే ప్రచారం ఉంది.ఓటమి చెందినప్పటి నుంచి కూడ ఆయన నియోజకవర్గంలో ప్రజల మద్యనే ఉంటూ వస్తున్నారు.పార్టీ కార్యక్రమాలకు తమ నేతను ఆహ్వనించటం లేదని,ప్రాధాన్యత తగ్గించారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.దీంతో జూపల్లి గతంలో జరిగిన మున్సిపల్,స్దానిక సంస్ధల ఎన్నికల్లో తన వర్గీయులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరీలో దింపి తన సత్తాచాటారు.కాలం గడుస్తున్నా కొద్ది ఎమ్మెల్యేకు జూపల్లి వర్గీయులకు గ్యాప్‌పెరిగింది తప్పా కలిసి పోయే పరిస్ధితులు కనిపించలేదు.ఒక్కమాటలో చెప్పాలంటే జూపల్లి,ఎమ్మెల్యే వర్గీయుల మద్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమనే స్దాయికి వెళ్లాయి.కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా చీలిపోయారు.

 

పార్టీ కార్యక్రమాలకు సైతం జూపల్లి దూరంగా ఉంటున్నారు.కొన్నిసందర్భాల్లో ఆయన తిరిగి పాతగూడు కాంగ్రేస్‌లో చేరుతారని…బీజేపీలోకి వెళ్తారని అనేక ప్రచారాలు సాగాయి.కార్యకర్తలు సైతం పార్టీలో ఉండి అవమానాలు భరించేకంటే పార్టీ మారటమే బెటర్‌ అంటూ అయనపై వత్తిడి తెచ్చారు.జూపల్లి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తువచ్చారు.గతంలో కొల్లాపూర్‌లో కేటీఆర్ పర్యటనకు దూరంగా ఉన్న జూపల్లిని కలిసేందుకు కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారు.దీంతో జూపల్లి వర్గీయులు ఊరట చెందారు.తర్వాత తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని డబ్బులకు ఆశపడి ఎమ్మెల్యే పార్టీ మారాడనే ఆరోపణలు సైతం జూపల్లి చేశారు. ఓ విషయంలో ఇద్దరి మద్య సవాల్‌,ప్రతిసవాల్‌ జరిగాయి,బహిరంగచర్చకు రావాలంటూ చేసిన సవాల్‌కు స్పందించి ఎమ్మెల్యే అందుకు సిద్దమైపోతుండగా పెద్దగొడవ జరిగి కొల్లాపూర్‌లో రచ్చరచ్చ అయ్యింది.ఈ క్రమంలో మెయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి కూడ ఉండటంతో మరోసారి నియోజక వర్గంలో రాజకీయం వెడెక్కింది.ఎమ్మెల్యే నెలరోజులుగా కనిపించటం లేదని పోస్టర్లు వేయటం,పోలీసులకు ఫిర్యాదు చేయటం వంటి అంశాలు అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారాయి.అయితే ఫాంహౌస్‌ కేసులో ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆణిముత్యాలుగా పేర్కొనటం. సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇస్తామని చేసిన ప్రకటనతో హర్షవర్దన్‌రెడ్డి వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపితే జూపల్లి వర్గీయులను కలవరపెట్టింది.

 

మునుగోడులో బీజేపీ గెలిస్తే కమలం గూటికీ వెళ్లాలనే యోచనలో జూపల్లి ఉండగా ఫలితం తారుమారు కావటంతో కొంత సందిగ్దంలో పడ్డారట.ఇంకోవైపు ఫాంహౌస్‌ ఎపిసోడును తమకు అనుకూలంగా మాలుచుకుని ఇండిపెండెంటుగా బరిలో దిగితే సానుభూతితో గెలిచే అవకాశం ఉందనే ఆలోచనలో కూడ జూపల్లి చేశారు.తర్వాత ఉమ్మడిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తానని చెప్పిన జూపల్లి అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంతోపాటు స్వంత నియోజకవర్గం కొల్లాపూర్‌లోని మండలాల్లో అనుచరులతో కలిసి సమ్మేళనాలు నిర్వహించారు.మొత్తంగా పార్టీమారే విషయంలో ఓ నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోలేక జూపల్లి సతమతమయ్యారు.తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనను నమ్ముకున్న కార్యకర్తలు,అనుచరులకు నష్టం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారు జూపల్లి.మరో ఆరునెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో తన నిర్ణయం ఆలస్యమైతే అసలుకే మోసం వస్తుందని భావించిన జూపల్లి తన కార్యచరణకు పదునుపెట్టారు.ఈ క్రమంలోమాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపుతో ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమ్మేళనానికి భారీగా కార్యకర్తలతో కలిసి హాజరయ్యారు.అక్కడే పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు గుప్పించటం హాట్‌టాపిగ్‌గా మారింది.ఆయన తాను చేసిన ఆరోపణలతో పార్టీ వీడేందుకు రేఢీగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు.ముఖ్యంగా సీఎం కేసీఆర్‌లో నిజాయితీ లోపించిందని..ఉద్యమకారులను విస్మరించారని…ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఘాటుగా విమర్శించారు.ఇది పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.సుదీర్ఘ రాజకీయ అనుభవనం..ప్రజాప్రతినిధిగా ఉమ్మడి జిల్లాలో మంచి క్యాడర్ ఉన్న జూపల్లిని సస్పెండ్ చేయటం పార్టీకి నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

ఉద్యమంలో మంత్రపదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరితే చివరికి ఉద్యమకారుడికి పార్టీ ఇచ్చే తాయిలం ఇదేనా అనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.అయితే అధికారపార్టీలోని అసంతృప్తులను కలుపుకుని ముందుకెళ్లేందుకు జూపల్లి ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది.పార్టీలో అనేక అవమానాలు..నిర్లక్ష్యానికి గురైన జూపల్లి. తనంతట తాను పార్టీ మారితే వచ్చే మైలేజీ కంటే పార్టీ తనను సస్పెండ్ చేస్తే వచ్చే సానుభూతి వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని భావించారు.అయితే చివరకు జూపల్లి ఆశించిందే జరగటంతో ఇక తమ నేత ప్రజాక్షేత్రంలో అసలు తడాఖా చూపుతాడని ఆయన వర్గీయులు అంటున్నారు.ఇప్పుడు జూపల్లి తన పాత పార్టీ హస్తం గూటికీ వెళ్తారా లేక కమలం పార్టీలో చేరుతారనన్న సందిగ్దం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.