మాస్టర్ ప్లాన్ జీఓ రద్దు చేయాలి
జీఓ రధ్దు చేసేంతవరకు పోరాటం అగదు ఎమ్మెల్సీ టి..జీవన్ రెడ్డి

జగిత్యాల
Noజగిత్యాల తిప్పన్నపేట వద్ద రోడుపై మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు అందోళన. చేపట్టారు రైతుల ఆందోళన లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..ఈ సందర్భంగా వారికి మద్దతు ప్రకటించారు..ఆనంతరం రైతుల ఉద్దేశించి జీవన్ మాట్లాడారు.మాస్టర్ ప్లాన్ ను నిలిపివేస్తాం అని చెప్పటం కాదు,సంభందిత జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మునిసిపల్ పట్టణ ఫరిదిలో ఉన్న వాటిని పరిగణలోకి తీసుకొని గ్రామాలను తీసివేయాలని కోరారు.ఇప్పుడు గుంటకు పదిలక్షలున్న భూములు,మాస్టర్ ప్లాన్ అమలవుతే ఎకరానికి పదిలక్షలవుతుందన్నారు
మాస్టర్ ప్లాన్ లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మునిసిపల్ పాలక వర్గం అమోదం తెలపటంతోనే పరిగణలోకి వచ్చింది..రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు చేసెంతవరకు రైతుల ఆందోళన లు ఉంటాయి,జీవో వల్ల రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని ..వెంటనే జీఓ రద్దు చేయాలని అయన డిమాండ్ చేశారు.