బాలవికాస స్వచ్చంద సంస్థ పై ఐటి దాడులు

దాడుల పై మండిన మంత్తి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్

వరంగల్ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. బాలవికాస స్వచ్ఛంద సంస్థలో అనుబంధ సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సెంట్రల్ పోర్స్ రక్షణలో ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించి అందరిని ఆందోళనకు గురి చేశారు. పాతికేళ్ళుగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఎంతో మంది నిరుపేదలకు సేవలందిస్తున్న బాల వికాస సంస్థ పై ఐటి దాడులు చేయడాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు పట్టారు.

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థలపై ఐటి అధికారులు దాడులు చేశారు. అందులో భాగంగా హన్మకొండ జిల్లా కాజీపేటలోని బాలవికాస స్వచ్ఛంద సంస్థలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. 4 వాహనాల్లో వచ్చిన ఐటి అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు అనుబంధ కార్యాలయాల్లో తనిఖీలు చేసి అందులో పని చేసే వారిని విచారించారు. సోమాజిగూడ లోని కార్యాలయంలోనూ, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల ఉద్యోగుల నివాసాలలోను, కీసరలోని 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. బాలవికాస స్వచ్చంద సేవ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరెడ్డి, ఆయన భార్య సునీత రెడ్డి, వ్యవస్థాపక డైరెక్టర్ థెరిస్సా సంస్థకు వచ్చిన కోట్లాది రూపాయలతో గత 25 ఏళ్ళుగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజా సేవా కార్యక్రమాలతో పాటు రైతులకు మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి, ప్రజా సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు అందుకున్న బాలవికాస సంస్థలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.

బాల వికాస సంస్థ పైన ఐటి దాడులు చేయడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడుతున్నారు. బాల వికాస లాంటి సేవా సంస్థలపై ఐటీ దాడులు అమానుషం అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బాలవికాస పై ఐటి దాడులను ఖండించిన మంత్రి ఎర్రబెల్లి గత 25, 30 ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాల వికాస అని, ఈ సంస్థపై దాడులు బాధాకరం అన్నారు. బాలవికాస క్రిస్టియన్ మిషనరీ కి సంబంధించిన సంస్థ కావడం వల్లే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రంలోని బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. దేశ విదేశాల్లో ఎంతోమంది ప్రముఖులు ప్రశంసించిన, మారుమూల గ్రామాలకు సైతం రక్షిత మంచినీటితో పాటు, అనేక సేవలను అందిస్తున్న బాలవికాస సంస్థ పై ఐటీ దాడులు చేయడం అవమానకరమని మంత్రి అభిప్రాయపడ్డారు.
.

Leave A Reply

Your email address will not be published.