చత్తీస్ ఘడ్ లో రేచ్చిపోయిన మావోలు
ఐఈడి పెల్చడంతో పది జవాన్లు, ఒక డ్రైవర్ మ్రుతి

..
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడి మందుపాతర పేల్చివేసిన ఘటనలో 11 మంది జవాన్లు మృతి చెందారు.
. దంతేవాడ జిల్లాలోని కౌకొండ బ్లాక్‌లోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు.డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో అరణ్పూర్ ప్రధాన రహదారి పై మావోయిస్టులు ఐఈడి మందుపాతర పేల్చివేసిన ఘటనలో డీఆర్జీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బాంబు ధాటికి తునాతునకలైంది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.
ఐఈడి మందుపాతరను పేల్చివేసిన ఘటనలో అసువులు బాసిన జవాన్ల నుంచి తుపాకులు, తూటాలను మావోయిస్టులు అపహరించారనే సమాచారం అందుతుంది.
ఈ మందు పాతర ఘటన వెనుక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, నెం 1 బెటాలియన్ కమాండర్ మడివి. హడ్మా నాయకత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
2021 ఏప్రిల్ 3 న బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందారు. ఒక జవాన్ ను కిడ్నాప్ చేసిన నక్సల్స్ ఐదు రోజుల తర్వాత విడుదల చేశారు.ఈ ఎదురు కాల్పుల ఘటన వెనుక హిడ్మా నాయకత్వం లోనే జరిగింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల కట్టడి కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టి, ఎక్కడికక్కడ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనలు నక్సల్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న మావోయిస్టులు పక్కా పధకం ప్రకారం దంతేవాడ ఎన్ కౌంటర్ కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు