గవర్నర్ బిజెపి ఎజెంట్.మంత్రి ఎర్రబేల్లి
సర్కార్ సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అని ప్రశ్బించిన. మంత్రి

వరంగల్
గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పై మంత్రి ఎర్రబెల్లి దయా ఇతర రావు ఫైర్ అయ్యారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి లో మూడు రోజుల పాటు జరిగే కంఠేశ్వరాలయ పునః ప్రతిష్టలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తున్నారని విమర్శించారు.
40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి గవర్నర్ ను ఎప్పుడు చూడలేదన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు అంతపెద్ద సెక్రెటరియేట్ నిర్మాణం జరిగితే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ క్రింద మంచి నీళ్లు ఇస్తున్నామని, కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించిన మంత్రి, రైతు సంక్షేమ రాష్ట్రంలో గవర్నర్ కు రైతుల ఆత్మహత్యలే కనిపిస్తున్నయా అని వ్యంగ్యంగా విమర్శించారు.