సాగునీరు కోసం పంటపోలాల్లో క్రికేట్ అడుతూ రైతులనిరశ‌న

గూడేం ఎత్తిపోతల పథకం మర్మమత్తులు చేపట్టాలని డిమాండ్

 

సాగునీరు ఇస్తామన్నారు.. పోలాలు సాగుచేసుకోవాలని ప్రచారం నిర్వహించారు.ఆ ప్రచారంతోనే రైతులు వరిసాగు చేశారు… కాని గూడేం ఎత్తిపోతల పథకం ద్వారా చుక్క నీరు అందడం లేదు… నీళ్లు లేక పచ్చని పంటపోలాలు ఎండిపోతు‌న్నాయి… ఆ ఎండిన పోలాల్లో రైతులు విన్నూతన నిరశన చేపట్టారు… పంటపోలాల్లో క్రికెట్ అడుతున్నారు… సర్కారు తీరు పై తిరగబడుతున్నారు.. ఎత్తిపోతల. పథకానికి మర్మమత్తులు చేయాలని …పంటలను పరిరక్షించాలని రైతుల చేస్తున్నా పోరాటం పై ప్రత్యేక కథనం

 

. మంచిర్యాల జిల్లాలో గూడేం ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల. పరిస్థితి దయనీయంగా మారింది… దండేపల్లి మండలం గూడేం గోదావరి నుండి సాగునీరు అందించడానికి సర్కార్ గూడేం ఎత్తిపోతల. పతకాన్ని నిర్మించింది..దీని ద్వారా దండేపల్లి, లక్షిట్ పెట, హాజీపూర్ మండలాల్లో ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి గూడేం ఎత్తిపోతల పథకం నిర్మించారు..

 

. కాని నాశి రకం పనుల వల్ల ఎత్తిపోతల ద్వారా నీరు అందించే పైపులు పగిలిపోతున్నాయి… పైపుల పగిలిపోవడం వల్ల ఆయకట్టుకు సాగునీరు అందడంలేదు…సాగునీరు అందకపంటపోలాలు ఎండిపోతున్నాయి.. పంటలు ఎండిపోయి పచ్చని పోలాలు నేర్రేలు బారుతున్నాయి..బీడుభూములుగా మారుతున్నాయి… లక్షిట్ పెట మండలంలోని లక్ష్మీ పూర్ , తిమ్మపూర్, చందారంతొ పాటు అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి పోలాలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.. ఎండిన. పంటపోలాల్లో‌ పశువులను మేపుతున్నామని లక్ష్మిపూర్ గ్రామ రైతు రాజయ్య అవేదన వ్యక్తం చేశారు…వేసవి కాలంలో పంటలు వేసుకోవాలని ప్రచారం నిర్వహించారు.. పైగా నీరు సరపరా చేస్తామని బరోసానిచ్చారు…ఆ మాటలు నమ్మి పంటలు సాగు చేస్తే..‌ ఎత్తిపోతల పథకం నుండి చుక్క నీరు రావడం లేదు..‌ నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… ఆ ఎండిన పొలాల్లో పశువులు ,ఎద్దులను మేపుతున్నామంటున్నారు రైతులు

 

 

నీళ్లు లేక అన్ని గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి… మరోక నెల రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి… ఎండిపోతున్నా పంటలు కాపాడాలని సాగునీరు ఇవ్వాలని రైతులు అదికారులు చుట్డు తిరిగారు..అదికారులు కనికరించలేదు…ఎత్తిపోతల. పథకం పైపులను మర్మమత్తులు చేయలేదు.. దాంతో కళ్ల ముందు కంటి రేప్పలా పెంచిన. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఎకరాకు నలబై వేల పెట్టుబడి పెట్టిసాగుచేస్తే ఇప్పుడు అణా పైసా వచ్చే పరిస్థితి రావడం లేదని రైతులు వాపోతున్నారు.. కోందరు గూడేం ఎత్తిపోతల పథకం నీళ్లు రాకపోవడంతో పంటలు రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు..అందులో బాగంగా బావులు తవ్వారు…ఆ తవ్విన బావిలో నీళ్లు రావడంలేదు…ఒకవైపు పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు..మరోక వైపు పంటలను రక్షించుకోవడానికి బావులను తవ్వి తీవ్రంగా నష్టపోయారు రైతులు.. ఈవిదంగా అప్పుల పాలయ్యామంటున్నారు రైతు మదుకర్… అయినప్పటికీ అదికారులు స్పందించడంలేదు..కనీసం మర్మమత్తుల గురించి మాట్లాడటం లేదు‌‌… చర్యలు చేపట్టడం లేదు..‌అదికారుల తీరును నిరశిస్తూ రైతులు సరికోత్త పంథాలో ఉద్యమం చేస్తున్నారు.. అందులో బాగంగా ఎండిన పంటపోలాలను మైదానాలుగా‌మార్చుతున్నారు… ఆ పంటపోలంలోనే కుటుంబ సభ్యులతో క్రికెట్ అడుతూ నిరశన. తెలుపుతున్నారు..ఈ సందర్భంగా నష్టపోయిన రైతులను అదుకోవాలని కోరుతున్నారు…అదేవిధంగా గూడేం ఎత్తిపోతల పథకానికి మర్మమత్తులు చేపట్టాలని రైతులు డిమాండ్ సర్కారు ను చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.