గిట్టబాటు ధర కోసం రైతుల. ధర్మయుద్ద.

రైతుల బందుకు అనుహ్యమైన స్పంద‌న

 

 

 

ధర దగా పై రైతుల.యుధ్దం‌. చేస్తున్నారు..ధర కోసం తిరుగుబాటు చేశారు..కుమ్రంబీమ్ జిల్లాలో . బంద్ నిర్వహించారు .. రోడ్డేక్కారు… జాతీయ రహదారిని దిగ్బందించారు.. గిట్టుబాటు ధర వచ్చేదాకా ధర్మయుద్దం అగదంటూ‌‌రైతులు జంగ్ సైరన్ మ్రోగించారు.. గిట్టుబాటు ధర.కోసం రైతుల. పోరాటం పై  ప్రత్యేక కథనం

.. తెల్ల బంగారం సాగు… బ్రతుకులను బంగారం చేస్తుందని.. కన్నీళ్లను తుడుస్తుందని కాటన్ రైతులు ఆశలు పెట్టుకున్నారు.. కాని ఆశలు అడియాశలవుతున్నాయి‌.. అంతర్జాతీయ. మార్కేట్ లో పత్తికి డిమాండ్ ఉంది…పైగా ప్రక్క రాష్ట్రాలలో పత్తి రైతులకు అమ్మకాలు రైతులకు పసిడి వర్షం కురుస్తోంది…

… కాని కుమ్రంబీమ్ జిల్లాలో పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు… పైగా ధరలో రైతులను మోసం చేస్తూ వ్యాపారులు రైతులు నిండా ముంచుతున్నారు‌.‌ కనీసం క్వింటాళ్ కు ఎడు వేలు, ఎనిమిది వేలు మించడంలేదు.. ఈ ధర రైతులకు గిట్టుబాటు కావడంలేదంటున్నారు… ఆ దరల.మోసంపై రైతులు జిల్లాలో ఉద్యమిస్తున్నారు..అందులో బాగంగా ఈ రోజు కుమ్రంబీమ్ జిల్లా బంద్ కు పాటించారు…ఈ బంద్ కు మంచిస్పందన లబిస్తోంది… జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య సముదాయాలు మూసి వేసి స్వచ్చందంగా బంద్ పాటించారు… రైతులకు సంఘీబావం ప్రకటించారు

అదేవిధంగా వాంకిడి లో జాతీయ రహదారి పై రైతులు అందోళన చేపట్టారు..జాతీయ రహదారి దిగ్బందం చేసి బైఠాయించారు రైతులు .. రైతుల అందోళనతో రహదారిపై వందల. వాహనాలు నిలిచిపోయాయి.. పత్తి క్వింటాల్ కు పదిహేను వేలకు కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు..,పదిహేను వేలకు పత్తిని కోనుగోలు చేసేంతవరకు పోరాటం అగదని హెచ్చరికలు జారీ చేశారు…

 

కేంద్ర. ,రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులకు గిట్టుబాటు ధర. క్వింటాల్ కు పదిహేను వేలకు కోనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు‌. ఒక క్వింటాల్ కు ఏడు, ఎనిమిది వేలకు అమ్ముకోవడం వల్ల పంటలు కోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నామని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.. కుమ్రంబీమ్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కూడ రైతులు రైతులు అందోళన చెపట్టారు.. క్వింటాల్ కు పదిహేను వేలు ఇవ్వాలని దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామంటున్నారు రైతులు…

Leave A Reply

Your email address will not be published.