పంచే కట్టి ‌క్రికేట్ గ్రౌండ్ బరిలో దిగిన కర్షకులు

అందరిని అకట్టుకున్నా రైతుల క్రికేట్

నిర్మల్
పంటపోలంలో సాగు సమరం సాగించే రైతులు.. క్రికెట్ గ్రౌండ్ బరిలో దిగారు… హలం‌ పట్టే రైతులు… పంచేకట్టి క్రికెట్ బ్యాట్ పట్టి బంతులను బౌండరీలు దాటించారు
రైతులు అన‌గానే చేత్తో నాగ‌లి ప‌ట్టి, పొలం దున్ని, పంట‌లు పండిస్తారని అంద‌రూ భావిస్తారు. అలాంటి

రైతులు క్రికెట్ ఆడి ఔరా అనిపించారు. నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో ఆదివారం అన్నదాతలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. అనంతపేట్, నీలాయిపేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట్ గ్రామాల రైతులు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. ఈ పోటీలను ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. పంచె కట్టులో ఉన్న రైతులు మైదానంలో చురుగ్గా పరుగులు తీస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రైతుల క్రికెట్ చూసేందుకు వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు..‌రైతుల క్రికెట్ చూసి మురిసిపోయారు ప్రజలు.

Leave A Reply

Your email address will not be published.