సీఎం కేసీఅర్ చిట్టాను బయట పెడుతాము.పోంగులేటి
అత్మీయ. సమ్మేళనంలో సంచలన వ్యాఖలు చేసిన పోంగులేటి

.ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేయటమే కాకుండా.. అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు మూడో సారి ఓటమి తప్పదు అన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కెసిఆర్ అమలు చెయ్యని హామీల చిట్ట బయట పెడతానన్నారు.
ఖమ్మం జిల్లా మధిరలో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ధనిక రాష్ట్రమైన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ దివాలా దిశగా తీసుకపోయిండని విమర్శించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలు విచారణ ఏ మేరకు సజావుగా సాగిందంటూ ప్రశ్నించారు.
మాయ మాటలతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ మూడవసారి పగటి కలగంటున్నాడని అది కలగానే మిగులుతుందన్నారు.. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఎకరాకు పదివేలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో మాయమాటలతో వచ్చే వారికి నోటితో కాకుండా ప్రజలందరూ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు