కాంగ్రేస్ లో ఎలేటి మహేశ్వర్ రెడ్డి లేఖ కలకలం
పాదయాత్రను అడ్డుకున్నారని మానిక్ రావు థాక్రేను టార్గేట్ చేసిన ఎలేటి

.. పాదయాత్రతో ప్రభంజనం స్రుష్టిస్తామన్నారు.. నాలుగు రోజులు పాదయాత్ర చేశారు… ఆ తర్వాత పత్తాలేకుండా పోయారు… మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర ను కాంగ్రెస్ పార్టీ పెద్దలు అడ్డకున్నారా?కమలం పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ పై తిరుగుబాటు చేస్తున్నారా? ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి తిరుగుబాటు పై ప్రత్యేక కథనం
.. తెలంగాణ కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి లేఖ. కలకలంరేపుతోంది.. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఐసీసీ కార్యక్రమాల అమలు కమీటీ చైర్మన్ గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ గా రేవంత్ రెడ్డి కి దీటుగా ఇటీవల మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా బైంసాలో పాదయాత్రను ప్రారంభించి…నాలుగు రోజుల పాటు యాత్ర..
నిర్వహించారు …మొదటి రోజు పాదయాత్ర ప్రారంభానికి జనం కరువయ్యారు. పార్టీఉద్దండులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర. రాజనర్సింహ వంటి వారు హజరైనా సభకు జనం లేకపరువుపోయింది..ఆ తర్వాత పాదయాత్ర ను సోంత నియోజకవర్గం లో నిర్మల్ లో పాదయాత్ర ను కోనసాగించారు మహేశ్వర్ రెడ్డి..
.. కాని ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించారు… నాలుగు రోజులుపాదయాత్ర చేసి పత్తాలేకుండా పోయారు…. నాలుగు రోజులకు పాదయాత్ర ను కుదించడానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల కారణమని ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. ఎలేటి పాదయాత్ర ఇతర ప్రాంతాలలో చేయకుండామానిక్ రావు థాక్రే అడ్డుకున్నారని థాక్రే కు రాసిన లేఖలో ఆరోపించారు.. మానిక్ రావు థాక్రే యాత్రను అడ్డుకోవడం బాదేసిందని అందోళన వ్యక్తం చేశారు… పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని అలాంటి నా పాదయాత్రను అడ్డుకోవడం పై లేఖలో అవేదన వ్యక్తం చేశారు. అందుకే తన పాదయాత్ర భట్టి పాదయాత్రలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించినట్లుగా వాపోయారు..
.. అయితే మహేశ్వరెడ్డి మానిక్ రావు లేఖ పై రాయడం వివాదస్పదంగా మారింది.. మహేశ్వర్ రెడ్డి నిర్వహించిన నిర్మల్ పాదయాత్రలో మానిక్ రావు థాక్రే పాల్గోన్నారు.. ఈసందర్బంగా యాత్ర చేస్తున్నా మహేశ్వర్ రెడ్డి అభినందించారు మానిక్ రావు
అలాంటి మానిక్ రావు కు లేఖరాయడం… యాత్రను అడ్డుకోవడం, పార్టీ పై వ్యాప్త దిక్కార స్వర వినిపించడం కాంగ్రెస్ లో దుమారం రేపుతుందట.. పార్టీ మారడానికి మహేశ్వర్ రెడ్డి సిద్దమయ్యారని జోరుగా ప్రచారం సాగుతుందట..కాంగ్రెస్ నుండి కమలంపార్టీలో చేరుతారని నియోజకవర్గం లో చర్చసాగుతుందట.. అందుకే గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్రను వ్యతిరేకించారట….ఇప్పుడు థాక్రే పై ఎదురుదాడి చేస్తున్నారట.. పార్టీ నుండి వెళ్లిపోయే ముందు… పార్టీ బలహీనం చేయడానికి మహేశ్వర్ రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన వ్యతిరేక వర్గీయులు బావిస్తున్నారట.. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఓడిపోయిన మహేశ్వర్ రెడ్డి రెడ్డి కి టిక్కేట్ ఇచ్చిందని..అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎఐసీసీ కార్యక్రమాలు అమలు చేయడానికి చైర్మెన్ నియమించింది…అయినప్పటికీ పార్టీ పై విమర్శలు చేయడం.. కన్నతల్లి లాంటి పార్టీని బలహీనం చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మహేశ్వర్ రెడ్డి పై మండిపడుతున్నారట.. కాని మహేశ్వర్ రెడ్డి పార్టీ మార్పును అంగీకరించడం లేదట… పైగా పార్టీ మార్పును తీవ్రంగా ఖండిస్తున్నారట..నియోజకవర్గం లోమహేశ్వర్ రెడ్డి పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగాసాగుతుందట…మరిపార్టీ మారుతారో లేదో చూడాలి·