పేదల ఇండ్లకోసం పోరాటంచెస్తున్నా మాజీకలెక్టర్ మురళి అరెస్ట్

మురళని అరెస్ట్ చేసి ఠానా కు తరలింపు

నిరుపేదల నివాసం  కోసం పోరాటం‌‌.డబుల్  బెడ్  రూమ్   ఇండ్లకోసం దర్నా చేపట్టారు…సర్కార్ దిగి రావాలని సమరం సాగించారు…   సమస్యను పరిష్కరించాల్సిన. సర్కారు  పోరాటం చేసిన. పాపానికిమాజీ కలెక్టర్  మురళి    అరెస్టు చేసింది‌‌‌‌…ఠానాకు తరలించారు

 

హన్మకొండ లో మాజీ కలెక్టర్ అకునూరి మురళిని పోలీసులు అరెస్టు చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో నిన్న భూపాలపల్లిలో ఆందోళన నిర్వహించిన మురళి, ఈరోజు హనుమకొండలోని బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి సందర్శించి ఆందోళనకు సిద్ధమయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తై రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికి లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో మురళి ఆందోళన బాట పట్టారు. ఆందోళన నేపథ్యంలో నిరుపేదలు నివాసముంటున్న గుడిసెల్లో రాత్రి బస చేసిన మురళిని తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పక్కలో నుంచి లేపుకొని స్టేషన్ కు తరలించడం పట్ల మాజీ ఐఏఎస్ మురళి అసహనంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలువ నీడలేని నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి, నిర్మాణాలు పూర్తైన లబ్ధిదారులకు అప్పగించకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అరెస్టులకు భయపడేది లేదని అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అప్పగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
.

Leave A Reply

Your email address will not be published.