రేవంత్, బండి సంజయ్ పిచ్చిగా మాట్లాడే మూర్కులు ఎర్రబేల్లి
రేవంత్ ,బండి సంజయ్ పై తీవ్రమైన విమర్శలు చేసిన మంత్రి

వరంగల్
టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి, బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న మూర్ఖులని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ ఐరన్ లెగ్, బండి సంజయ్ వి తొండి మాటలు… ఇద్దరు తుపాకీ రాముడిని మించిపోయారని మండిపడ్డారు. సీఎం కెసిఆర్ ఉద్యమ ప్రస్థానంపై ఎమ్మెల్యే నరేందర్ వరంగల్ ఓ సిటీ గ్రౌండ్ లో మూడు రోజుల పాటు నిర్వహించే ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఇంటింటా కెసిఆర్ పుట్టిన రోజు జరుపుకోవాలని కోరారు. తెలంగాణ తెచ్చిన గాంధీజీ కెసిఆర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రదాత… భావి భారత విధాత కేసిఆర్ అని ఆయన దేశానికే మార్గదర్శని తెలిపారు. సీఎం కెసిఆర్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణను సాధించారని, సాధించిన తెలంగాణ ను తెర్లు కాకుండా కాపాడుతూ, దేశంలోనే అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపారని చెప్పారు. సీఎం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు మన తెలంగాణ లో తప్ప దేశంలో ఎక్కడా లేవని చెప్పారు
. సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తున్న రేవంత్, బండి సంజయ్ పిట్టల రాముడిలా పెగ్గెలు కొడుతున్నారని, వాళ్ళతో ఊదు కాలదు… పీరు లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్. బండి సంజయ్ ఓ తొండి మనిషి. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇలాంటి వాళ్ళతో ఏమీ కాదు. వాళ్ళను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.