జనగామ మున్సిపల్ చైర్మన్ జమునపై కౌన్సిలర్ల తిరుగుబాటు

చైర్మన్ జమన, వైస్ చైస్ చైర్మన్ ,ప్లోర్ లీడర్ ని మార్చాలని డిమాండ్

జనగామ జిల్లా.

జనగామ మున్సిపాలిటీలో అదికార పార్టీలో మున్సిపల్ చైర్మన్ పై అసంత్రుప్తి అగ్గిరాజేసింది… చైర్మన్ జమున మార్చాలని క్యాంపు రాజకీయాలు కోనసాగుతున్నాయి… 11 మంది అధికార పార్టీ కౌన్సిలర్లు  చైర్మన్ పై తిరుగుబాటు చేశారు.. క్యాంప్ ను కోనసాగిస్తున్నారు..ఇప్పటికేఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చైర్ పర్సన్ వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్ ను మార్చాలని లేఖ రాశారుచైర్ పర్సన్ జమున, వైస్ చైర్మన్ రాంప్రసాద్, ఫ్లోర్ లీడర్ పాండు లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కౌన్సిలర్లు

 

మూడు సంవత్సరాలలో వారి పని విధానంలో ఏమాత్రంమార్పురాలేదన్నారు.ఇష్టానుసారంగా వ్యవహరిస్తు నియంతృత్వ పోకడలతో పార్టీని, కౌన్సిల్ ను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.కాంటాక్టర్లలతో కుమ్ముక్కై పనుల్లో కమీషన్, ఇండ్ల పర్మిషన్ల విషయంలో డబ్బులు వసూలు చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని లేఖలో ఆరోపించారు.అన్ని వార్డులల్లో జోక్యం చేసుకోని స్వంత పార్టీ కౌన్సిలర్ లను  అవమాన చేస్తున్నారని అంటున్నారు

ఈ విషయాన్ని తమరి దృష్టికి నాలుగు నెలల క్రితమే తీసుకువచ్చాము ..అయిన వారిలో ఏమాత్రం మార్పు రాలెదన్నారు… అలాగే కొనసాగిస్తే పార్టీకి ప్రమాదం ఉంటుందన్నారుమీ శ్రేయోభిలాషులుగా మరోకసారి తమరి దీృష్టికి తీసుకవస్తున్నాము.వారిస్థానంలో మీరు సూచించిన వ్యక్తుల్ని ఎన్నుకోని పార్టీని మరింత భలోపేతం చేస్తామని ఎమ్మెల్యే కు లేఖను రాశారు కౌన్సిలర్లు… మరి ఎమ్మెల్యే ఏలాంటి నిర్ణయం‌ తీసుకుంటారనేది అసక్తికరంగా మారింది

Leave A Reply

Your email address will not be published.