నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పై అవిశ్వాసం?

అవిశ్వాసం లేదని కోట్టిపారేస్తున్నా మున్సిపల్ చైర్మన్

.‌  ఉద్యోగాల  అమ్మకంతో  పరువు  పోయింది.. మాస్టర్ ప్లాన్   తో    ప్రతిష్ఠ  తగ్గింది.. ప్రజల్లో వ్యతిరేకత పెంచింది‌..   ఆ వ్యతిరేకతే   మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్  పదవికి ఎసరుతేస్తోంది,..కౌన్సిలర్లు  తిరుగుబాటు చేస్తున్నారు.. అవిశ్వాసం   ప్రయోగించడానికి  సిద్దమవుతున్నారు. నిర్మల్    మున్సిపల్ చైర్మన్  ఈశ్వర్ పై అవిశ్వాసం అస్త్రం‌పై  ప్రత్యెక కథనం

.‌నిర్మల్   పట్టణం‌  మున్సిపల్  చైర్మన్ ఈశ్వర్   పై  కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు.. అవిశ్వాసంతో   పదవీచ్యతుడు చేయడానికి ఎత్తుగడలు వేస్తున్నారు.. అందులో బాగంగా అసమ్మతి  కౌన్సిలర్లు  సమావేశం నిర్వహించారు.. కౌన్సిలర్  ఆయ్యన్న. గారి రాజేందర్  కౌన్సిలర్  అధ్వర్యంలో   సమావేశం    నిర్వహించారు‌.. ఈ   అసమ్మతి కౌన్సిలర్ల సమావేశానికి   బిఅర్ ఎస్    కౌన్సిలర్లు ఇరవై రెండు మంది మద్దతు ఉంది…అదేవిధంగా  కాంగ్రెస్  నుండి ఇద్దరు, ఎంఐఎం నుండి  మద్దతు    ఇస్తున్నారని  అసమ్మతి నాయకులు అంటున్నారు..మొత్తం నలబై రెండు మంది కౌన్సిలర్లలో  ఇరవై ఆరు మంది  అవిశ్వాసానికి మద్దతు  ఇస్తున్నారు

…  అసమ్మతి కౌన్సిలర్లు   గోవా  క్యాంప్    వెళ్లడానికిసిద్దమయ్యారు…అయితే రేపు మంత్రి ఇంద్రకరణ్  రెడ్డి  అసమ్మతి కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించనున్నారు… ఆ సమావేశం లో‌మంత్రి బుజ్జగిస్తారా లేక.  సమస్యను పరిష్కరించడానికి   ఏలాంటి చర్యలు తీసుకుంటారనేది అసక్తిరకరంగా మారింది.ఒకవేళ   మంత్రి  బుజ్జగిస్తే కౌన్సిలర్లు దారి వస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది..

.. ‌అయితే   మున్సిపల్  చైర్మన్ ఈశ్వర్     వ్యవహరశైలి   పార్టీ   పరువు పోయిందంటున్నారు అసమ్మతి కౌన్సిలర్లు.. ప్రదానంగా మున్సిపాలీటీలో పబ్లిక్  హెల్త్  వర్కర్ల నలబై   నాలుగు‌‌  ఉద్యోగాలు‌‌  ఉద్యోగాల నియమాకం జరిగింది..ఈ   ఉధ్యోగాలన్ని  అక్రమంగా    నియమాకం ‌జరిగిందని… అమ్మకాలు  జరిగాయని   అర్డీఓ విచారణలో తెలింది.ఆ తర్వాత ఉద్యోగాల నియమాకాలను రద్దు చేశారు… అయితే ఉద్యోగాల నియమాకమైనా వారిలో మున్సిపల్ చైర్మన్ బందువులు, కౌన్సిలర్ల ,  బిఅర్ ఎస్  పార్టీకి  చెందిన వారు కావడం విశేషం

..ఈ.   ఉద్యోగాల అమ్మకంతో   బిఅర్  ఎస్  పై   ప్రజల్లో  తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది…  ‌ప్రతిష్ట దిగజారింది…మున్సిపల్ అంగడి సరుకుగా మారింది    ప్రచారం  ఉంది… డబ్బులు పెడితేచాలు   మున్సిపల్ లో    ఎదైనా   జరుగుతుందని  ..‌బ్రోకర్లకు   అడ్డగా మారిందని  ఆరోపణలు ఉన్నాయి.. దీనికి  తోడు  మున్సిపల్ మాస్డర్     డ్రాప్ట్   ప్లాన్  అగ్గి రాజేసింది… రైతుల భూముల నుండి  రోడ్డు నిర్మాణం ప్రతిపాదన విరమించుకోవాలని  రైతులు  ఉద్యమించారు.. ఇది కూడ  మంత్రికి తలనోప్పిగా మారింది.. ఎవన్ని   ఒకత్తేయితే    చైర్మన్ పై  అవిశ్వాసం   మరోక ఎ్తత్తుగా మారింది.. ఈ నేపథ్యంలో    ఈశ్వర్  ను పదవి నుండి దించాలని పట్టుబడుతోంది…అంతేకాదు   చైర్మన్  పదవి నుండి  తొలగించాలని అసమ్మతి వర్గం  పావులు  కదుపుతోంది…రేపు మున్సిపల్ సమావేశం  తర్వాత క్యాంప్  కు   వెళ్లుతామని   చెబుతుండటం ఈశ్వర్ కు    దడపుడుతోంది.

ఆయితే    ఈశ్వర్ కు  ‌మంత్రికి అత్యంత. సన్నిహితుడు కావడం …‌అసమ్మతి   నాయకులతో ఈశ్వర్    సంప్రదింపులు  జరుపుతున్నారు..   అసమ్మతి  కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు
తనపై    అసమ్మతి లేదని  ఒకవైపు కోట్టిపారేస్తున్నారు…మంత్రి   నాయకత్వం లో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు…

   అదేవిదంగా  మంచిర్యాల జిల్లా   నస్పూర్  మున్సిపల్ చైర్మన్  ప్రభాకర్ పై     కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు..‌ చైర్మన్  తీరుమార్చుకోవాలని  హెచ్చరికలు  జారీ చేశారు..‌ఒకవైపు  చైర్మన్ గా మరోక వైపు సింగరేణి   ఉద్యోగి పనిచేస్తున్నారని మున్సిపల్ వైస్  చైర్మన్ శ్రీనివాస్ ఆరోపించారు… తాము    కూడ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెడుతామని   హెచ్చరికలు జారీ చేశారు… ఇదిలా ఉంటే ఆదిలాబాదు మున్సిపల్ వైస్ చైర్మన్ జహిర్  రంజాని   తీవ్రమైన.  వ్యతిరేకత ఉంది‌‌‌…  అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి…అవినీతి వైస్  చైర్మన్  తొలగించాలని ‌  సంతకాల సేకరణ చేస్తున్నారు బిఅర్ ఎస్ కౌన్సిలర్లు ‌.‌‌ సేకరించిన. సంతకాలతో ‌    ఎమ్మెల్యే   రామన్న ను  కలిసి    పదవి తోలగించాలని  కోరుతామంటున్నారు కౌన్సిలర్లు..‌మరి  అవిశ్వాసాలు  ఎటువైపు మళ్లుతాయోనని   బిఅర్ ఎస్  నాయకులు అందోళన చెందుతున్నారు.. అసమ్మతి ఏదుర్కోంటున్నా  చైర్మన్లు,  వైస్ చైర్మన్  సయోధ్య తో  పదవులు కాపాడుకుంటారో లేదో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.