భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రేమ్ సాగర్ రావు అదిపత్యంపై తిరుగుబాటు?

ప్రేమ్ సాగర్ రావు అదిపత్యం పై మండిపడుతున్నా సీనియర్లు

 

 

భట్టి విక్రమార్క. పాదయాత్ర లో అంత మాజీ ఎమ్మెల్సీ అదిపత్యమే… ఆ అదిపత్యమే దండయాత్రను మరిపిస్తోంది… పార్టీ కోసం పని‌కోసం వారిని ప్రక్కన పెడుతున్నారు… ఆయన. అనుచరులైతే చాలు అందలం ఎక్కిస్తున్నారు… వాళ్లే అభ్యర్థులంటూ ప్రకటనలు చేస్తున్నారు…. ఆ ప్రకటనలపై తిరుగుబాటు చేస్తున్నారు.. భట్టివిక్రమార్క పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అదిపత్య దండయాత్ర పైప్రత్యేక కథనం

 

..ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది.. పిప్రి గ్రామంలో ప్రారంభమైన యాత్ర బోథ్ నియోజకవర్గం లో కోనసాగుతోంది..అయితే పాదయాత్ర లో‌ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అదిపత్యం పార్టీలో‌ అగ్గిరాజేస్తోంది…. పార్టీ సీనియర్ నాయకుడిగా అందరిని కలుపుకోవాల్సినా ప్రేమ్ సాగర్ రావు తన అనుచరులే పార్టీ నాయకులని ప్రచారం చేస్తున్నారు… పైగా ఇంచార్జులుగా ప్రకటిస్తున్నారట.. దాంతో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన. వారిన ప్రక్కన పెడుతుండటం వివాదానికి కారణమవుతుంది..

.. పాదయాత్ర. సందర్భంగా భట్టివిక్రమార్క స్వాగతం పలకడం నుండి ఇచ్చోడలో కార్నర్ మీటింగ్ లో ప్రేమ్ సాగర్ రావు కనుసన్నలో జరిగింది.. కనీసం భట్టికి స్వాగతం పలికేందుకు స్థానికులకు అవకాశం దక్కలేదట మంచిర్యాల నియోజకవర్గం లోని మహిళలకు అవకాశం ఇచ్చారట‌..దీనితో స్థానిక మహిళ కార్యకర్తలు మనస్థాపానికి గురయ్యారట…అదేవిధంగా
మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ వన్నేల. ఆశోక్, గణేష్ రాథోడ్ డాక్టర్లుగా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.. వీరిద్దరిని ప్రేమ్ సాగర్ రావు ప్రోత్సహిస్తున్నారు ‌‌‌.‌బోథ్ నియోజకవర్గం లో పాదయాత్ర. నిర్వహిస్తుండటంతో వన్నేల ఆశోక్ కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచారం చేస్తున్నారట‌‌..

. ఎళ్లుగా పార్టీ కోసం పని చేసిన వాళ్లను ప్రేమ్ సాగర్ రావు ప్రాదాన్యత ఇవ్వడంలేదట.. ఇచ్చోడ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ప్రేమ్ సాగర్ తనకు నచ్చిన వాళ్లకు అవకాశం ఇచ్చారట.. సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వ లేదట… బోథ్ నియోజకవర్గం లో సభను నిర్వహిస్తే… మంచిర్యాల జిల్లాకు చెందిన. నాయకుడిగా ప్రేమ్ సాగర్ రావు అదిపత్యం చలాయించడాన్ని తట్టుకోలేక. పోతున్నారట అక్కడి నాయకులు..

‌. ప్రేమ్ సాగర్ రావు ఆయన అనుచరుడు వన్నేల ఆశోక్ ను సభలో పోగడటం పై కోందరు తప్పుపట్టారట… ఎకంగా అడే గాజేందర్ అదే వేదిక పై ప్రేమ్ సాగర్ రావు తీరును తప్పుబట్టారట‌.. తాను పార్టీ‌ని నమ్ముకోని ఎళ్లుగా పనిచేస్తున్నానని వేదిక పై అక్కసును వెళ్లగక్కారట.. ముప్పైవేల సభ్యత్వం చేశానని‌ అవేదన వ్యక్తం చేశారట..

. పార్టీ పెద్దల సభలు, సమావేశాలకు మాత్రమే హజరయ్యే నాయకులను ప్రేమ్ సాగర్ రావు ప్రోత్సహిస్తున్నారని ఆయన తీరు పై మండిపడుతున్నారట‌..ప్రేమ్ సాగర్ రావు ఒంటేద్దు పోకడం వల్ల బోథ్ నియోజకవర్గం లో కాంగ్రెస్ రెండు చీలిపోయిందట… ఒకటి ప్రేమ్ సాగర్ రావు అనుచరుల వర్గం,మరొకటి ప్రేమ్ సాగర్ రావు వ్యతిరేక. వర్గం ఏర్పడిందట‌… పాదయాత్ర తో బలపడాల్సిన. పార్టీ…మాజీ ఎమ్మెల్సీ అదిపత్యంతో పార్టీ బలహీనం అవుతుందని కార్యకర్తలు అందోళన చెందుతున్నారట… అయితే ప్రేమ్ సాగర్ రావు అదిపత్యం బోథ్ నియోజకవర్గానికి పరిమితం కాలేదట‌.‌అసిపాబాద్ ,ఖానాపూర్, బెల్లంపల్లి, చెన్నూర్ లో ఆయన అనుచరులను ప్రోత్సహిస్తున్నారట‌.‌ఈ నియోజకవర్గాలలో సీనియర్ కార్యకర్తలకు, రేవంత్ వర్గ నాయకులకు ప్రేమ్ సాగర్ రావు ప్రాదాన్యత ఇవ్వడం లేదట…ఇదేవిదంగా ప్రేమ్ సాగర్ రావు అదిపత్యం కోనసాగితే ‌‌‌‌..కోందరు ఆయన అదిపత్యం తట్టుకోలేక. తమదారి చూసుకోవడానికి ప్రక్క పార్టీలు చూస్తున్నారట… మరి ప్రేమ్ సాగర్ రావు అదిపత్యంపై పార్టీ దిద్దుబాటు చర్యలు చేపడుతుందో లేదో చూడాలి

Leave A Reply

Your email address will not be published.