భట్టి విక్రమార్క పాదయాత్రలో భగ్గుమన్నా విబేదాలు

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై తిరుగుబాటు చేసిన. డీసీసీ అద్యక్షుడు విశ్వప్రసాద్, సరస్వతి

  భట్టి విక్రమార్క. పాదయాత్రలో అగ్గిరాజేసిన విభేదాలు. ..అన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్, విశ్వప్రసాద్ ల. మద్య యుద్దం‌. అన్నదమ్ముల. ‌మద్య. తారస్థాయికి చేరిన టిక్కెట్ల యుద్దం… మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పై తిరుగుబాటు చేసిన‌ తమ్ముడు డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్.. సభవేదిక సాక్షిగా బైఠాయించిన డీసీసీ అధ్యక్షుడు, ఆయన వర్గం‌… ప్రేమ్ సాగర్ రావు పై తమ్ముడు విశ్వ ప్రసాద్ తిరుగుబాటు చేయడానికి కారణాలేంంటి? తిరుగుబాటుదార్ల పై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసిన ప్రేమ్ సాగర్ రావు?భట్టి విక్రమార్క. పాదయాత్రలో కాంగ్రెస్ లో టిక్కెట్ల పంచాయితీ పై ప్రత్యేక కథనం

 

 

.. కుమ్రంబీమ్ జిల్లా అసిపాబాద్ లో సీఎల్పీ‌నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్ లో విబేదాలు బయటపడ్డాయి…మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, కుమ్రంబీమ్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ వీరిద్దరు అన్నదమ్ములు.. ఈ. ఇద్దరి మద్య. పోరు తారస్థాయికి చేరింది….ఆ. పోరు పాదయాత్ర సాక్షి గా మరింత ముదిరింది…. సీఎల్పీ ‌నాయకుడు విక్రమార్క పాదయాత్ర. ఆసిపాబాద్ ‌కు చేరింది.. ఈ‌సందర్బంగా సభను ప్రమీల‌ గార్డేన్ సమీపంలో సభ నిర్వహించారు… ఈ సభనే రెండు గ్రూపుల‌‌‌ మద్య. వివాదానికి కారణమైంది…

‌ .‌ ప్రమీల గార్డెన్ వద్ద కాకుండా సభను అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, ఆయన వర్గానికి‌ చెందిన మర్సకోల సరస్వతి కోరారు…కాని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు‌., ఆయన వర్గానికి చెందిన గణేష్ రాథోడ్ ఏర్పాటు చేసినప్రమీల గార్డేన్ వద్ద సభను నిర్వహించారు.. దీనిని విశ్వ ప్రసాద్, మర్స కోల. సరస్వతి తీవ్రంగా వ్యతిరేకించారు… ఈ వివాదంతోనే రెండు వర్గాల‌మద్య. గోడవ ముదిరింది‌..తోపులాట. జరిగింది…ఒకదశలో దాడి చేసుకునే స్థాయికి చెరింది… ఎకంగా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, సరస్వతీ సభ. వేదిక ముందు బైఠాయించారు.. ప్రేమ్ సాగర్ రావు, గణేష్ రాథోడ్ పై డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, సరస్వతి తిరుగుబాటు చేశారు..ఈ సందర్భంగా ఓంటేద్దు పోకడల పై మండిపడ్డారు.. అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా సభలో కూడ మాట్లాడుతానని భట్టి హమీ ఇచ్చారు.. దాంతో విశ్వప్రసాద్ వర్గం అందోళన. విరమించింది.. హమీ మేరకు చౌరస్తా సభలో కూడ. భట్టి మాట్లాడారు‌. ఇలా రెండు వర్గాలను బుజ్జగించారు

.. అయితే సభ వేదిక ‌మార్చాలని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, సరస్వతి , వాళ్ల అనుచరుల. తిరుగుబాటు పై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు స్పందించారు…‌ఈ. గోడవ భట్టి ముందు తన పరువు తీసిందన్నారు.. అవమానం తట్టుకోలేక పోతున్నానని అవేదన వ్యక్తం చేశారు ప్రేమ్ సాగర్ . దీనికి కారణమైనా వారి పై ప్రతీకారం తీర్చుకుంటామని ‌ప్రేమ్ సాగర్ రావు శపథంచేశారు. వివాదానికి కారణమైనవారికి బుద్ది చెబుతామన్నారు…తాను అసిపాబాద్ నుండి రాజకీయ జీవితం ప్రారంభించానని .. కోందరికి భయపడి ఇక్కడ నుండి వెళ్లే ప్రసక్తే లేదన్నారు ప్రేమ్ సాగర్ రావు

..అయితే అన్నదమ్ముల మధ్య గోడవకు అసలు కారణాలు వేరే ఉన్నాయట.. మాజీ ‌ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు , తన అనుచరుడు డాక్టర్ గణేష్ రాథోడ్ కు టిక్కెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు… ఆయనకే టిక్కెట్ దక్కుతుందని ప్రేమ్ సాగర్ రావు ప్రచారం చేస్తున్నారట..‌ కాని గణేష్ రాథోడ్ కు టిక్కెట్ ఇవ్వాలనే ప్రతిపాదనని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ వ్యతిరేకించడానికి కారణాలు ఉన్నాయట.. టిక్కెట్ విశ్వప్రసాద్ తన వర్గానికి చెందిన సరస్వతి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట.. ఆ టిక్కెట్ విషయం పై అన్నదమ్ములు పాదయాత్ర సాక్షిగా విడిపోయారు.. అనుచరులకు టిక్కెట్ ఇప్పించడానికి ఇద్దరు మద్య ‌పోరు బహిర్గతమైంది..ఈ పోరు మరింత. ముదిరేవకాశాలు కనిపిస్తున్నాయి.. కాంగ్రెస్ టిక్కెట్ గోడవ పై కార్యకర్తలు అందోళన చెందుతున్నారట..వివాదాన్ని ముదరకుండా చర్యలు చెపట్టాలని కోరుతున్నారట… మరి ఈ వివాదాన్ని కాంగ్రెస్ పెద్దలు ఏలా పరిష్కరిస్తారొ చూడాలి..

Leave A Reply

Your email address will not be published.