వరంగల్ పశ్చిమలో కాంగ్రేస్ లో అగ్గిరాజేస్తున్నా విబేదాలు

డీ అంటే డీ అంటున్నా డీసీసీ అద్యక్షుడు రాజేందర్ రెడ్డి జంగారాఘవ రెడ్డి

వరంగల్ ..

 

ఆ  ఇద్దరి   మద్య యుద్దం ముదిరింది. ఒకరిని  ఒకరుసస్పేండ్   చేసుకున్నారు … సమరానికి‌‌సై అంటే  సై  అంటున్నారు..హన్మకొండ డీసీసీ  అధ్యక్షుడు   రాజెందర్  రెడ్డి, డీసీసీబి అధ్యక్షుడు జంగా    రాఘవ రెడ్డి  టిక్కెట్   కోసం   కత్తులు  దూసుకుంటున్నారు..ఈ. కాంగ్రేస్ నాయకుల  కోట్లాటకు   కారణాలేంటి? రాజేందర్   రెడ్డి, జంగా రాఘవరెడ్డి మద్య. వార్ పై ప్రత్యేక  కథ‌నం¯

 

ఓరుగల్లు కాంగ్రెస్ లో పోరుసాగుతుంది. వరంగల్ పశ్చిమనియోజకవర్గంలో నేతల మద్య కాక పుట్టి పార్టీ శ్రేణులను పరేషాన్ చేస్తుంది. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యంతో హన్మకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మెన్ జనగామ జిల్లా మాజీ అద్యక్షులు జంగా రాఘవరెడ్డి మద్య పొలిటికల్ వార్ సాగుతుంది. వ్యక్తిగత విమర్శలతోపాటు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని జంగాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించి సస్పెండ్ చేస్తూ అధిష్టానంకు సిపార్సు చేశారు నాయిని రాజేందర్ రెడ్డి. జంగా తానేమి తక్కువ కాదన్నట్లు అసలు నాయినినే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జంగా ప్రకటించి పార్టీకి లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇద్దరి మద్య పరస్పర సస్పెన్షన్ ల ప్రకటన అటు అధిష్టానంను ఇటు పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తుంది.

 

 

ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లులో కాంగ్రేస్ లో రచ్చ సాగుతుంది. టిక్కెట్ రేస్ కొనసాగుతుంది. గతంలో జరిగిన పోరపాటు మళ్ళీ జరగకూడదని పార్టీ అధిష్టానం భావిస్తు పకడ్బందీ వ్యూహంతో ముందడుగు వేస్తుంటే పార్టీలో నెలకొన్న అంతర్గత ప్రజాస్వామ్యం, నేతల మద్య గ్రూప్ రాజకీయాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుకు వరంగల్ ప‌శ్చిమ నియోజకవర్గం వేధికగా మారింది. రాజ‌కీయ జ‌గ‌డం నాయిని రాజేందర్ రెడ్డి వ‌ర్సెస్ జంగా రాఘవరెడ్డి అన్నట్లు సాగుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ టిక్కెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఇద్దరు నేతలు పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజల్లో పలచనయ్యే పరిస్థితి ఏర్పడింది. హ‌న్మ‌కొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య‌క్షులు నాయిని రాజేంద‌ర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘవ‌రెడ్డి ఇద్ద‌రు పశ్చిమ టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు. ఈక్ర‌మంలోనే ఇద్ద‌రు నేత‌లు పోటాపోటీగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర‌ను ఇద్ద‌రు నేత‌లు వేర్వేరుగా చేపట్టడంతోపాటు రాహుల్ గాందీ పార్లమంట్ సభ్యత్వం రద్దు చేయడంపై పిసిసి పిలుపు మేరకు నిరసన దీక్షలను పోటాపోటీగా నిర్వహించారు. డిసిసి అద్యక్షుని హోదాలో నాయిని రాజేందర్ రెడ్డి డిసిసి కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టగా జంగా రాఘవరెడ్డి కాజీపేట చౌరస్తాలో దీక్ష చేసి అంతర్గత విబేధాలు గ్రూప్ రాజకీయాలను మరోసారి రుజువు చేశారు. ప్ర‌జాబలం తనకే ఉందని నిరూపించుకునేందుకు ఇద్దరు నేతలు యత్నించి జనం ముందు బొక్కబోర్లపడ్డి పార్టీ పరువు బజారుకు ఈడ్చారు.

వాస్తవంగా జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు ఉండగా కాజీపేటలో జంగా రాఘవరెడ్డి పోటీ నిరసన దీక్ష చేపట్టడం పార్టీలో కలకలం సృష్టిస్తుంది. డిసిసి అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తు జంగా రాఘవరెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తు సస్పెండ్ కు పార్టీ అధిష్టానంకు సిపార్సు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తు షోకాజ్ నోటీసులను విస్మరించి అధిష్టానం హెచ్చరించినా పట్టించుకోకుండా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతోనే సస్పెండ్ చేశామని ప్రకటించారు. అతనికి ఎవ్వరు సహకరించినా పార్టీ పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రౌడీ షీటర్ అంటు జంగా పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు నాయిని. పార్టీలోని కొందరు నాయకులతోపాటు అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే జంగా పార్టీని అబాసుపాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ళ లో 20 సార్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఇకనైనా జంగా పై చర్యలు తీసుకోనిచో తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసే అధికారం హన్మకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి కి లేదని జంగా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. ఆయననే నేను సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించి అధిష్టానంకు లేఖ రాస్తున్నానని తెలిపారు. నాయిని లాంటి పార్టీ ద్రోహులు వస్తుంటారు.. పోతుంటారు ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తో పొత్తులో భాగంగా రేవూరి ప్రకాష్ రెడ్డి కి టికెట్ ఇస్తే అతని దగ్గర 4 కోట్లు తీసుకోలేదా…దేవరుప్పుల లో కాంగ్రెస్ ఎంపిటిసి బి ఫామ్స్ 36 లక్షలకు ఎర్రబెల్లి దయాకర్ రావు కు అమ్ముకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రాజేందర్ రెడ్డి మీద మర్డర్ కేసు నమోదు అయ్యింది నిజం కాదా? అన్నారు. నేను స్థానికుడిని…రాజేందర్ రెడ్డి కాదని…ఎట్టి పరిస్థితిలో అయినా వరంగల్ పశ్చిమలో పోటీ చేసి గెలుస్తానని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదని, హనుమకొండలో డిసిసి అనుమతి లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించవద్దని అధిష్టానం నన్ను ఆదేశించలేదని తెలిపారు. ఉలంఘించినట్లు పార్టీ అధిష్టానం భావించి నన్ను అడిగితే అప్పుడు సమాధానం చెబుతానని తెలిపారు. అరేయ్ ఒరేయ్ అనుకోవడం సహజం… అది నాయిని తప్పుగా భావిస్తే నేను తప్పే అని భావిస్తానని చెప్పారు. నేను ఎవరి ప్రోద్బలంతో పనిచేయడం లేదు…నికార్స్ అయినా కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ కోసం పని చేస్తున్నానని.. ఎవరో అడిగిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను…పాలకుర్తిలో పోటీ చేయనని గతంలోనే అధిష్టానం కు చెప్పానని జంగా తెలిపారు.

వాస్త‌వానికి గ‌త సంవ‌త్స‌రకాలంగా ఏదో ఒక కార్య‌క్ర‌మం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో జంగా నిర్వహిస్తు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో పొత్తుల్లో భాగంగా మ‌హా కూటమి అభ్య‌ర్థికి కాంగ్రెస్ పశ్చిమ స్థానాన్ని కోల్పోవాల్సి రావ‌డంతో నాయినికి టికెట్ ద‌క్క‌లేదు. అయినా పార్టీని ప‌ట్టుకుని ప‌నిచేశార‌న్న భావ‌న అధిష్ఠాన పెద్ద‌ల్లో ఉంది. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని కూడా అప్ప‌గించ‌డంతో క‌ష్ట‌కాలంలో పార్టీని ముందుండి న‌డిపించిన స‌మ‌ర్థుడనే అభిప్రాయం ముఖ్య నేత‌ల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈనేప‌థ్యంలోనే ఆయ‌న‌కు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ టికెట్ ద‌క్కుతుంద‌నే ధీమాను నాయిని అనుచ‌రులు వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇటీవల టిపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి నగరంలో పాదయాత్ర చేసిన సందర్భంలో నాయిని నిర్మొహమాటంగా తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరారు. రేవంత్ సున్నితంగా ఆ బాధ్యత వి.హన్మంతరావు తీసుకుని అధిష్టానంను ఒప్పించి నాయిని కి టిక్కెట్ ఇప్పించాలని సూచించారు. అదే సమయంలో జంగా ను సైతం సుతిమెత్తగా మందలించినట్లు సమాచారం. దీంతో హ‌న్మ‌కొండ డీసీసీ బాధ్య‌త‌లు నిర్వహిస్తున్న నాయిని నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ రాజ‌కీయ వేగం పెంచారు. అదే సమయంలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ రేసులో తాను ఉన్న‌ట్లుగా జంగా సంకేతాలు ఇస్తు పోటీ కార్యక్రమాలు నిర్వహించడం అటు పార్టీ అధిష్టానంను ఇటు పార్టీ శ్రేణులను అయోమయంలో పడేసి పార్టీ పరువును కాస్త రోడ్డుకీడ్చినట్లయ్యిందని ఓరుగల్లు ప్రజలు భావిస్తున్నారు. పరస్పర విమర్శలు సస్పెన్షన్ ల ప్రకటనలపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పంధిస్తుందోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇద్దరి మద్య ముదిరిన వివాదం ఎటు వైపు దారితీస్తుందోనని ఇతర పార్టీలనేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.